బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్ కింద ఆయన్ను నిర్బంధించడాన్ని సలహా మండలి ఆమోదించిందందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన్ను 12 నెలల పాటు నిర్బంధిస్తూ అక్టోబరు 19న ఉత్తర్వులు జారీ చేశానని పేర్కొంది. ఈ విషయాన్ని శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High court) కు నివేదించింది. స్టాండప్ కమెడియన మునావర్ ఫరూఖీని షోను అడ్డుకునే ప్రయత్నం చేయడం, మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో... రాజాసింగ్‌పై తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆగస్టు 25న ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో ఉంచారు.
రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ. . ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ ఎ. అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె. శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్‌కుమార్ సదాశివుని వాదనలు వినిపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారని.. ఈ క్రమంలోనే పీడీ చట్టం కింద ఆయన్ను నిర్బంధించామని చెప్పారు. దానిని సలహా మండలి కూడా ఆమోదించిన విషయాన్ని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న తాజాగా జీవో జారీ
చేసిందని చెప్పారు.
ఇక పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని వాదించారు. మరి ప్రభుత్వ జీవోను సవాల్ చేశారా అని కోర్టు ప్రశ్నించడంతో... సవరణ పిటిషన్ దాఖలు ఆయన తెలిపారు. ఈ క్రమంలో తదపరి విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది హైకోర్టు.
కాగా, ఈ ఏడాది ఆగష్టు 25న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 29న పీడీ యాక్ట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను ఎత్తివేయాలని కమిటీకి విన్నవించుకున్నారు రాజాసింగ్. అయితే తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేసినట్టు బోర్డు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. కానీ దీనిపై విచారణ జరిపిన బోర్డు పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్ధించింది. పీడీ యాక్ట్ ఎత్తివేయాలన్న రాజాసింగ్‌ను అభ్యర్ధనను కమిటీ తిరస్కరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Raja Singh, Telangana, Telangana High Court