శుక్రవారం ఉదయం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాని ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా విపక్షలు ఇది రైతుల విజయంగా అభివర్ణించారు. దీంతో పాటు మోదీ సైతం రైతులకు క్షమాపణలు చెప్పడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇక తెలంగాణలో కూడా మోదీ నిర్ణయాన్ని కొంతమంది నేతలు స్వాగతించగా మరికొంతమంది అధికార పార్టీ నేతలు ఇది టీఆర్ఎస్ విజయంగా చెప్పుకొచ్చారు. సీఎం కేసిఆర్ ధర్నా చేయడంతో మోదీ దిగివచ్చారని అన్నారు.
అయితే ప్రతిపక్షపార్టీలతోపాటు దేశంలోని వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టాలు రద్దు చేసిన సంధర్భంగా బ్రోకర్లకు శుభాకాంక్షలు అంటూ పేర్కోన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారని అన్నారు...అయితే.. పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు.
ఇది చదవండి : నూతన రైతు చట్టాల రద్దుపై రాష్ట్ర నేతలు ఏమన్నారు.. ?
అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అన్నదాతలు బ్రోకర్ల మాట నమ్మారని, నిరసనల వెనుక బ్రోకర్లు ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిధులు వారే ఇచ్చారు. సారా ప్యాకేట్స్ ఇచ్చిన అంశాలను మనము చూశామన్నారు.వీళ్ల వెనుక ఉన్న వారు దేశ వాతావరణం పాడుచేస్తున్నారని ప్రధాని మోడీ గమనించారని అని అన్నారు. అందుకే రైతు చట్టాలు రద్దు చేశారని అన్నారు..ఇక చట్టాలను రద్దు చేయాలని కోరిన రైతులే రాబోయే రోజుల్లో రైతు చట్టాలు కావాలని ప్రధాని మోడీ ని కోరుతారని దీమా వ్యక్తం చేశారు...అనంతరం బ్రోకర్ లకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది చదవండి : ఆ లేడీస్ హాస్టల్లో అర్థరాత్రి ఒక్కటే శబ్ధాలు.. కట్ చేస్తే.. హాస్టల్ మొత్తం ఖాళీ..
ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఎవ్వరు ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు.. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఇక రైతులు వారి ఇళ్లల్లోకి వెళ్లి సంతోషంగా పండగ చేసుకోవాలని సిక్కు రైతుల ఉద్దేశించి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farm Laws, Raja Singh