హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఎన్నికలొస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తుకొస్తారు.. అక్కడ పథకాలు వస్తాయి: ఈటల

Telangana: ఎన్నికలొస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తుకొస్తారు.. అక్కడ పథకాలు వస్తాయి: ఈటల

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్​)

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్​)

ప్రజా గోస BJP భరోసా యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతొంది. ఈ యాత్రకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  తెలంగాణ (Telangana) గడ్డపై తదుపరి గెలుపు భారతీయ జనతా పార్టీదేనని హుజురాబాద్ శాసన సభ్యుడు, BJP చేరికల కమిటి చైర్మెన్ ఈటెల రాజేందర్ (Eetala rajendar)ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ (Huzurabad) ఫలితమే మునుగోడులో (Munugodu) పునరావృతమవుతందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బును, మద్యాన్ని నమ్ముకున్న కెసిఆర్ కు మునుగోడులో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజా గోస – బిజెపి భరోసా (Praja Gosa – BJP Bharosa) రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఈటెల పలు గ్రామాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈటెల రాక సందర్భంగా ఆదిలాబాద్ (Adilabad) శివారులోని మావల నుండి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తో కలిసి మోటార్ బైక్ ప్రయాణించిన ఈటెల అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో పర్యటించి, ఆ జీపు పైనుండే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

  ఆదిలాబాద్ మండలంలోని భీంసరి గ్రామం నుండి ఈటెల యాత్ర ప్రారంభమైంది. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తదితరులు ఈటెల వెంట ఉన్నారు. కాగా ఈ ప్రజా గోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా భీంసరి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఈటెల మాట్లడుతు కెసిఆర్ (CM KCR)పై తీవ్రంగా మండిపడ్డారు.

  రాష్ట్రంలో పాలన కొనసాగించడానికి కేసీఆర్​ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని పబ్బం గడుపుతున్నారన్నారు. కేసీఆర్​ విధానాలను వ్యతిరేకించినందుకే తనను పార్టీ నుండి బయటకు వచ్చేలా చేశారని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే తన చంచాలతో సస్పెండ్ చేయించారని అన్నారు.రాష్ట్ర ప్రజలు ఇదంతా చూస్తున్నారన్నారు.

  Land Scam: బతికున్న మనిషి చనిపోయిందని రికార్డులు సృష్టించి.. వేరే వ్యక్తి పేరుపై భూ పట్టా చేసిన తహసీల్దార్​

  ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్​ ఆరాచక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికలప్పుడే కేసీఆర్​ కు ప్రజలు గుర్తుకు వస్తారని, ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ పథకాలు కొత పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన తరువాత తమ బతుకులు బాగుపడతాయని అనుకున్న తెలంగాణా ప్రజలకు నిరాశే ఎదురైయ్యిందని అన్నారు. కేసీఆర్​ నియంతృత్వ కుటుంబ పాలనలో రాష్ట్రం వందేళ్ళు వెనక్కి పోయిందన్నారు. తెరాస (TRS) చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజకు తెలిసేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, TRS మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఈ యాత్ర ఆదిలాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Bjp, CM KCR, Eetala rajender

  ఉత్తమ కథలు