హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka Bypolls 2020: హోటల్ లో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల బాహాబాహీ.. సిద్దిపేటలో ఉద్రిక్తత

Dubbaka Bypolls 2020: హోటల్ లో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల బాహాబాహీ.. సిద్దిపేటలో ఉద్రిక్తత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉప ఎన్నిక సమరం మొదలుకావడానికి కొద్ది గంటల ముందు సిద్దిపేటలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల తోపులాటలతో జిల్లా కేంద్రం మరోసారి వేడెక్కింది.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :

  దుబ్బాక ఉప ఎన్నిక సమరం మొదలుకావడానికి కొద్ది గంటల ముందు సిద్దిపేటలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో సిద్దిపేటలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల తోపులాటలతో జిల్లా కేంద్రం మరోసారి వేడెక్కింది. ఈ ఘర్షణలో ఆంధోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్వల్పంగా గాయపడ్డారు. అంతేగాక మాజీ ఎమ్మెల్యే విరేశం డ్రైవర్, మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతల చేతికి గాయాలయ్యాయి. తమపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఖండించారు.

  ఘటనపై క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి పూట తాము భోజనం చేసే సమమయంలో బీజేపీ జిల్లలా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బీఎంఎస్ నేత కలాల్ శ్రీనివాస్.. మరికొందరు బీజేపీ కార్యకర్తలను వెంటేసుకుని తమ వద్దకు వచ్చి దాడి చేశారని తెలిపారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని ఆయన ఆరోపించారు. తమవైపునకు దూసుకువచ్చి.. దుర్భాషలాడారని, తనపై దాడికి యత్నించారని అన్నారు. తమపై ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినా వారు వినకుండా తమపై దాడికి దిగారని అన్నారు. దళిత ఎమ్మెల్యేను కాబట్టే.. తనపై దాడి చేశారని.. ఒకవేళ దుబ్బాక లో రఘునందన్ గెలిస్తే దళితులు, పేదలకు రక్షణ కరువవుతుందని విమర్శలు చేశారు.

  ఇదే విషయమై ఏసీపీ విశ్వప్రసాద్ స్పందిస్తూ.. గాయపడిన ఎమ్మెల్యే, మరో నాయకుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని అన్నారు. స్థానికంగా ఓటు హక్కు లేని ప్రజా ప్రతినిధులు దుబ్బాక లో ఉండరాదని, నియోజకవర్గం వెలుపల ఎవరైనా ఉండొచ్చని తెలిపారు. కాగా, క్రాంతికిరణ్ పై దాడి గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆ హోటల్ దగ్గరకు పెద్దఎత్తున చేరుకున్నారు.

  మరోవైపు ఇదే అంశంపై బీజేపీ నేతల స్పందన వేరే విధంగా ఉంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. టీఆర్ఎస్ నాయకులు దుబ్బాకలో డబ్బులు పంచుతున్నారనే అనుమానంతోనే హోటల్ కు వెళ్లామని అన్నారు. హోటల్ యజమాని రూములు లేవనడంతో అన్ని గదులు తనిఖీ చేస్తుండగా.. ఓ గదిలో ఎమ్మెల్యే క్రాంతికిరన్ ఉన్నారని.. ఆయనే తమపై దాడికి దిగారని ఆరోపించారు. తాము ఎనిమిది మందిమే వెళ్లామని, కానీ పెద్ద ఎత్తున వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు.

  ఎంపీ అర్వింద్ ఫైర్..

   DUBBAKA, DUBBAKA BYPOLLS, DUBBAKA BYPOLLS 2020, DUBBAKA BY ELECTIONS, Telangana by elections, Dubbaka Assembly constituency, Dubbaka by election, Dubbaka bypoll, Dubbaka bypoll voting, Dubbaka bypoll voting status, dubbaka voting latest news, news about dubbaka, TRS, Telangana Rashtra Samithi, BJP, BJP candidate, M Raghunandan Rao, Solipeta Sujatha
  ఎంపీ అర్వింద్ (ఫైల్)

  దుబ్బాక ఎన్నికలలో భాగంగా సిద్దిపేట లోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అర్ధరాత్రి సమయంలో ఓటర్లకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందనీ, రాత్రి సమయంలో పంచిన డబ్బు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున పంచితే మరో వంద కోట్ల రూపాయల భారం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

   DUBBAKA, DUBBAKA BYPOLLS, DUBBAKA BYPOLLS 2020, DUBBAKA BY ELECTIONS, Telangana by elections, Dubbaka Assembly constituency, Dubbaka by election, Dubbaka bypoll, Dubbaka bypoll voting, Dubbaka bypoll voting status, dubbaka voting latest news, news about dubbaka, TRS, Telangana Rashtra Samithi, BJP, BJP candidate, M Raghunandan Rao, Solipeta Sujatha
  హరీశ్ రావు (File)

  హరీశ్ రావు స్పందన..

  టీఆర్ఎస్ పార్టీ కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక అస‌హ‌నానికి గురై బీజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే, ద‌ళిత మాజీ ఎమ్మెల్యేల‌పై భౌతిక దాడులకు దిగడం శోచనీయం అనిఅన్నారు. ఇది హేయమైన చర్య అని అభివర్ణించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

  ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని, వాళ్ళు ఉంటున్న లాడ్జ్ కి వెళ్లి వారి పై భౌతిక దాడులకు పాల్పడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. ఇది బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలని ఆయన కోరారు. రెచ్చ‌గొట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందని.. కానీ ఆ కుట్రలకు లొంగిపోమని అన్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుందని.. ఎన్ని గిమ్మిక్కులు చేసినా దుబ్బాక‌లో గెలిచేది టీఆర్ఎస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Dubbaka By Elections 2020

  ఉత్తమ కథలు