నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ... టార్గెట్ టీఆర్ఎస్...

BJP in Telangana : తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దింపి, తాము అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ... అందుకు బలంగానే అడుగులు వేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 6:51 AM IST
నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ... టార్గెట్ టీఆర్ఎస్...
బీజేపీ పార్టీ సింబల్
  • Share this:
Maha Sammelanam : దక్షిణాదిన కర్ణాటకను తప్పిస్తే... తాము అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలూ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న బీజేపీ... అందుకోసం బలమైన గ్రౌండ్ వర్క్ చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహా సమ్మేళనం పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరాబోతుండటమే కాదు... చాలా మంది ఇతర పార్టీల నేతలు... ఇదే సభలో బీజేపీలో చేరబోతున్నారు. మొత్తం 170 మంది నేతలు చేరబోతున్నారని తెలిసింది. తద్వారా... తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ... 2022 లేదా 2023 మొదట్లో జరిగే జమిలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని గద్దె దింపి... తాము అధికారంలోకి రావాలనే లక్ష్యంతో దూకుడు ప్రదర్శిస్తోంది.

తెలంగాణలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది బీజేపీ. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సైతం... ఇక్కడే సభ్యత్వం తీసుకొని... తెలంగాణలో బీజేపీ గెలుపు ఎంత ముఖ్యమో సంకేతాలిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రతీ నెలా ఆయన తెలంగాణ వచ్చి... పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు. అలాగే... నెలకు ఇద్దరు చొప్పున బీజేపీ అగ్రనేతలు తెలంగాణ వచ్చి... రాజకీయాల్ని సమీక్షిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ టీమ్ కూడా దూకుడు పెంచింది. ప్రభుత్వంది అరాచకపాలన అంటూ దుమ్మెత్తి పోస్తోంది. ఇలా తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ చాలా యాక్టివ్ అయిపోయింది.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా... ఉదయం 11.55కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. అక్కడి నుంచీ ర్యాలీగా బీజేపీ ఆఫీస్‌కి వస్తారు. అప్పటికి టైమ్ మధ్యాహ్నం 1.30 కానుంది. భోజనం తర్వాత 2 గంటలకు మున్సిపల్ ఎన్నికల క్లస్టర్ ఇంఛార్జులతో మీటింగ్ పెట్టుకుంటారు. తర్వాత... సాయంత్రం 4.10కి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో జరిగే కోర్ కమిటీ మీటింగ్‌లో పాల్గోనున్న నడ్డా... రాత్రికి అక్కడే పడుకుంటారు. 19న మార్నింగ్ EWS క్వార్టర్స్‌లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అంబేద్కర్ కాలేజీలో మొక్కలు నాటతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

బీజేపీకి అంత సీన్ ఉందా : మోదీ సారధ్యంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చాక... అత్యంత యాక్టివ్‌గా ఉంది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఆ పార్టీ ఏమాత్రం రాజీ పడకుండా ఓ ప్లాన్ ప్రకారం పనులు చేసుకుపోతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంతటి వ్యూహకర్తో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా అంతే వ్యూహకర్త. పైగా నడ్డా బాగా మాట్లాడగలరు. శ్రేణుల్ని బాగా ఆకట్టుకోగలరు. ఇప్పటికే బీజేపీ... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.ఫెడరల్ ఫ్రంట్ అంటూ లోక్ సభ ఎన్నికలప్పుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోసిన కేసీఆర్... ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. ఐతే... అంతమాత్రాన టీఆర్ఎస్‌ని తక్కువ అంచనా వెయ్యలేం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. అలాంటి పార్టీని పూర్తిగా పక్కన పెట్టి... బీజేపీకి పట్టం కట్టడం అంత తేలిక కాదు. ఈ సవాలును బీజేపీ ఎంతలా ఎదుర్కోగలిగితే... ఆ పార్టీ తెలంగాణలో విస్తరించే అవకాశాలు అంతలా మెరుగవుతాయి.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...