Paddy Dispute : టీఆర్ఎస్ కంటే ముందే బీజేపీ అటాక్..... టీఆర్ఎస్కు నో అపాయింట్మెంట్..ఎవరి వాదన వారిదే
kishan reddy file pic
Paddy Dispute : వరి ధాన్యంపై సేకరణ వివాదం మొదటికే వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముదిరిన
వివాదంతో రైతులు ఇబ్బందులు తొలిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.. ధాన్యం సేకరణలో ఎవరి
వాదనలు వారే వినిపిస్తున్నారు..
ఢిల్లీలో వరి వార్ పీక్ స్టేజికి చేరింది. గత మూడు రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అంతకంటే ముందుగా తెలంగాణబీజేపీ నేతలు ఆయనతో సమావేశం అయ్యారు. దీంతో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆపార్టీ నేతలు భేటి అయ్యారు. అనంతరం పియూష్ గోయల్‌తో పాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గతంలో చెప్పిన అంశాలనే తిరిగి ప్రస్తావించారు. పియూష్ గోయల్‌తో పాటు కిషన్ రెడ్డిలు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
ఈ సంధర్భంగా పియూష్ గోయల్ ( Piyush goel ) సైతం రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గత నాలుగు సంవత్సరాల్లో ఐదు రెట్లు పెంచామని, దీనికి తోడు నాలుగు సార్లు ధాన్యం సేకరణకు అవకాశం ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వరి ధాన్యం సేకరణ కోసం రాష్ట్రానికి అవకాశం ఇచ్చామని , అని విధించిన టార్గెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైస్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
అనంతరం కిషన్ రెడ్డి ( Kishanreddy ) సైతం రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. గత రభి సీజన్‌కు సంబంధించి 44.75 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనడానికి అగ్రిమెంట్ జరిగిందని, బాయిల్డ్ రైస్‌తో పాటు రా రైస్ కూడా 17.78 లక్షల మెట్రిక్ టన్నుల రైస్‌కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం 4.64 మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఎఫ్‌సీఐకి మాత్రమే అందించారు. బాయిల్డ్ మరియు రా రైస్ ఒప్పందాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 27.39 లక్షల మెట్రిక్ టన్నుల రైస్‌ను ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని అయినా.. దాని సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదని చెప్పారు. కాగా ఒప్పందాల ప్రకారం ఎఫ్‌సిఐ కొనుగోలు చేయాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుందని చెప్పారు.గతంలో బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి ఎందుకు లిఖిత పూర్వకంగా ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలకు సంబంధించి స్టాక్ ఉన్నా కేంద్రం రైస్‌ను కొనుగోలు చేస్తుందని చెప్పారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో వాదన వినిపిస్తుంది. కేంద్రం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏమేరకు కొనుగోలు చేస్తారో స్పష్టమైన హామి ఇస్తే తప్ప తాము ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాదిస్తున్నారు. ఇలా ఎవరికి వారు వాదనలు వినిపిస్తుండడంతో ధాన్యం సేకరణ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఎలాంటీ ఫలితం కనిపించడం లేదు.. అయితే నేడు మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశానికి అధికారిక అపాయింట్ మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికే మంత్రి ఇచ్చిన ప్రకటనపై రాష్ట్ర నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఒకవేళ టీఆర్ఎస్కు కేంద్రమంత్రి పియూష్గోయల్ అపాయింట్మెంట్ ఇస్తే ఎలాంటీ సమాధానం వస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.