నేడు ఏపీ పోతిరెడ్డిపాడు జీఓకు నిరసనగా బీజేపీ నేతల దీక్ష

బండి సంజయ్(ఫైల్ ఫోటో)

నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

  • Share this:
    పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నంబరు 203ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీఓ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీళ్లు-నిధులు-నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది జలాల దోపిడిని అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జీఓ నంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తే నేడు బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్ష చేపట్టనున్నారు. ఈయనకు తోడుగా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకుచెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే నిరసన దీక్షకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వ జీఓపై బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. అపరభగీరథుడిగా తన వందిమాగధుల చేత పొగిడించుకున్న సీఎ కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంపై ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
    Published by:Narsimha Badhini
    First published: