Vijayashanti KCR: రూ. 2 లక్షల కోట్లు.. 165 ఏళ్లు.. సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్లు

సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)

Vijayashanti KCR: కేసీఆర్‌కి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని…తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు.

 • Share this:
  తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ రైతు బంధు పథకంపై బీజేపీ నేత విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ నియోజకవర్గంలోని 20 వేల పైచిలుకు కుటుంబాల కోసం రూ.2 వేల కోట్ల మేర ఖర్చుచేస్తామని ప్రకటించారని విజయశాంతి గుర్తు చేశారు. దీనికి పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్‌ను ఎంచుకోవడమంటే… ఆ పథకాన్ని ముందుగా ఇక్కడ అమలుచేసి, ఫలితాలను బట్టి లోటుపాట్లు సరిచేసి, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించారని అన్నారు. ఇక తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం 2 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని.. అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా ? అని ప్రశ్నించారు.

  సీఎం కేసీఆర్ లెక్క ప్రకారం ఇదంతా కార్యరూపం దాల్చడానికి 165 సంవత్సరాలు పడుతుందని విజయశాంతి అన్నారు. దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… అంటూ కేసీఆర్ గారు మరచిన వాగ్దానాలు, దళిత ఉపముఖ్యమంత్రులకు దక్కిన మర్యాదలాగే ఈ దళిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యే వ్యవహారం అనిపిస్తోందని విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు.

  కేసీఆర్‌కి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని…తెలంగాణ దళిత బంధు పథకం అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు. పథకం అమలులో నిర్లక్ష్యం కనబరిస్తే సహించేది లేదని అధికారులకు గట్టి హెచ్చరిక కూడా చేశారని… ఈ నిర్ణయం వెనుక లోగుట్టు ఏమిటో ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటుండదని విజయశాంతి విమర్శించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: