• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • BJP LEADER VIJAYASHANTI REACTION ON LAWYER VAMANARAO MURDER IN PEDDAPALLI DISTRICT OF TELANGANA AK

Telangana: లాయర్ దంపతుల హత్య.. అంతా ప్రభుత్వ అశ్రద్ధ అని మండిపడ్డ విజయశాంతి

Telangana: లాయర్ దంపతుల హత్య.. అంతా ప్రభుత్వ అశ్రద్ధ అని మండిపడ్డ విజయశాంతి

విజయశాంతి (ఫైల్ ఫోటో)

Telangana: అధికార పార్టీ నేతలు చాలా సందర్భాలలో నిందితులను తప్పించడం, బలహీనమైన చార్జిషీట్లు వేయించి, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అనేకమంది నేరం చేసి కూడా బయటపడుతున్నారని విజయశాంతి విమర్శించారు.

 • Share this:
  పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాది దంపతుల హత్య ఘటనపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. లాయర్ దంపతుల హత్య అత్యంత బాధాకరమని అన్నారు. అధికార పార్టీ నేతలు చాలా సందర్భాల్లో నేరం చేసి కూడా బయటపడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. కేసుల విచారణలో ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడమే ఇందుకు కారణమని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో ఇంతవరకూ అప్పీళ్ళకు వెళ్లని నేరారోపిత కేసుల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అందుకు కారణాలు కూడా తెలపాలన్నారు.

  అధికార పార్టీ నేతలు చాలా సందర్భాలలో నిందితులను తప్పించడం, బలహీనమైన చార్జిషీట్లు వేయించి, కేసుల విచారణలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అనేకమంది నేరం చేసి కూడా బయటపడుతున్నారని విజయశాంతి విమర్శించారు. ఏదో ఒక కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న నేరస్తుల కేసులను పై కోర్టులలో అప్పీలు చెయ్యకుండా ప్రభుత్వం లాలూచీ ధోరణితో వ్యవహరించడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. విచారణలో తప్పించుకున్న క్రిమినల్స్ మరల దారుణమైన నేరాలకు పాల్పడుతుండటం చూస్తున్నామని ధ్వజమెత్తారు.

  ఇక ఈ హత్య కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. బిట్టు శ్రీనును అరెస్ట్ చేసినట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. వామన్ రావు దంపతుల హత్యకు బిట్టును శ్రీనే కారు, కత్తులు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. బిట్టు శ్రీను పెద్దపద్దలి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడం.. అతడే హత్యకు సహకరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హత్యకు స్కెచ్ వేసిన తర్వాత మంథనిలోని ఓ పండ్ల దుకాణం నుంచి కత్తులు తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ పండ్ల దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినదని పోలీసుల దర్యాప్తులో తేలింది.వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, విలోచవరం గ్రామానికి చెందిన చిరంజీతో పాటు బిట్టు శ్రీను పోలీసుల అదుపులో ఉన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు