హోమ్ /వార్తలు /తెలంగాణ /

Aasara Pesions: పింఛన్​లు ఆగస్టు 15నే ఇస్తానన్నారు కదా? ఏమైంది? : TRS​ ప్రభుత్వంపై విజయశాంతి సెటైర్లు

Aasara Pesions: పింఛన్​లు ఆగస్టు 15నే ఇస్తానన్నారు కదా? ఏమైంది? : TRS​ ప్రభుత్వంపై విజయశాంతి సెటైర్లు

విజయశాంతి (ఫైల్​)

విజయశాంతి (ఫైల్​)

తెలంగాణలో కొత్త పింఛన్​‌ల ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ నేత విజయశాంతి సెటైర్లు వేశారు. కొత్త పింఛన్​‌దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదంటూ సోషల్ మీడియా వేదిక‌గా టీఆర్​ఎస్​ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో (Telangana) కొత్త పింఛన్​‌ల (New Pensions)ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (BJP Leader Vijaya shanti)  సెటైర్లు వేశారు. కొత్త పింఛన్​‌దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదంటూ సోషల్ మీడియా వేదిక‌గా టీఆర్​ఎస్​ ప్ర‌భుత్వం (TRS government)పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించినా అవి సెప్టెంబర్‌లోనే ఖాతాల్లో పడే పరిస్థితులు కనిపిస్తుంద‌న్నారు. ప్రస్తుతానికి ఊరికి ముగ్గురు, నలుగురు చొప్పున మండలానికి 48 మందిని ఎంపిక చేసి.. వారికి మాత్రమే ఆసరా పెన్షన్ (Aasara pension) కార్డులు పంపిణీ చేశారని విమ‌ర్శించారు. కొత్త పింఛన్​‌దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదని అన్నారు.

  విజయశాంతి మాట్లాడుతూ..  ఎంపీడీఓల లాగిన్‌లో అప్రూవల్ అయి ఉన్న 3.30 లక్షల మంది జాబితాను ఇప్పుడు మరోసారి వెరిఫై చేస్తున్నారని తెలిపారు.  57 ఏళ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల (Aasara pension) కోసం గతేడాది ఆగస్టు, అక్టోబర్​లో రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుందని గుర్తు చేశారు. ఈ స‌మ‌యంలో దాదాపు 10 లక్షల దరఖాస్తులొచ్చాయనీ. కానీ అప్లికేషన్లు తీసుకుని ఏడాదైనా సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై కూడా చేయలేదని విజయశాంతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  సెప్టెంబర్ చివరలో పింఛన్లు..

  వారికి కార్డులొచ్చినా.. ఫ‌లితం లేద‌నీ, అకౌంట్లలో డబ్బులు జమకాలేదని విజయశాంతి అన్నారు. కార్డుల పంపిణీ ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని టీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రకటించ‌డంతో ఈ నెలాఖరు దాకా పంపిణీతోనే సరిపెట్టి సెప్టెంబర్ చివరలో పింఛన్లు జమచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. 2018 సెప్టెంబర్ తర్వాత బైఎలక్షన్స్ జరిగిన హుజురాబాద్, నాగార్జునసాగర్‌లో మినహా సర్కారు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదనీ అన్నారు.

  3 Lakhs for House: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి త్వరలో రూ. 3 లక్షలు.. తెలంగాణ ప్రజలకు హరీశ్​ రావు గుడ్​న్యూస్​.. 

  గత నాలుగేండ్లలో రాష్ట్రంలో 3.30 లక్షల కొత్త పింఛన్ అప్లికేషన్లను అప్రూవ్ చేసినా.. పెన్షన్ (Aasara pension) మాత్రం ఇవ్వలేదని విజయశాంతి గుర్తు చేశారు. వీరిలో 57 ఏళ్లు నిండినోళ్లు మాత్రమే కాకుండా.. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, ఎయిడ్స్ బాధితులు కూడా ఉన్నార‌ని తెలిపారు.

  ఆ అప్లికేషన్లు ఇంకా తమ లాగిన్‌లోకి రాలేదని ఎంపీడీఓలు చెప్తున్నార‌ని విజయశాంతి అన్నారు. అప్లై చేసుకున్నవారిలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో తేల్చకుండా... అందరికీ పింఛన్లు ఇవ్వడం కుదరదని, జాబితా వచ్చాక డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తే తప్ప అర్హులెవరో గుర్తించలేమని ఎంపీడీఓలు చెబుతున్నారని ఆమె తెలిపారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు, ఖాతాల్లో జమ చెయ్యడం ఇలా ప్రతి దశలోనూ తీవ్ర జాప్యం చేస్తూ కేసీఆర్ సర్కారు ఏళ్ళకేళ్లు గడిపేస్తోంది. ఈ పరిస్థితి పింఛన్ ఆశావహుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోందని విజయశాంతి మండిపడ్డారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aasara pension, Trs, Vijayashanthi

  ఉత్తమ కథలు