హోమ్ /వార్తలు /తెలంగాణ /

Vijayashanthi : సీఎం కేసిర్ హుజురాబాద్ పోయో ధైర్యం లేకనే... పక్క జిల్లాల పర్యటనలు

Vijayashanthi : సీఎం కేసిర్ హుజురాబాద్ పోయో ధైర్యం లేకనే... పక్క జిల్లాల పర్యటనలు

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

Vijayashanthi : సీఎం కేసీఆర్ పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని బిజెపి నేత విజయశాంతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎం పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. అరెస్టులు, వేధింపుల కోసమే అన్నటుగా సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుందని ఆమె విమర్శించారు. నేరుగా హుజురాబాద్ పోలేక పక్క జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి ...

సీఎం కేసిఆర్ జిల్లా పర్యటన భారి బందోబస్తు నడుమ కొనసాగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా...ముందుగా పోలీసుల పహారాలు ఉంటున్నాయి..మరోవైపు కేసిఆర్‌ టూర్‌కు అడ్డంకిగా మారతారని ముందే ఉహించి వారిని అరెస్ట్ సైతం చేస్తున్నారు. ఆయన వెళ్లే సమయంలో రోడ్లన్ని బ్లాక్ చేస్తున్నారు. సో ఇలా ఆయన గత మూడు రోజుల జిల్లా పర్యటనలు కొనాసాగాయి..అయినా అక్కడక్కడ నిరుద్యోగ విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్‌కు పంపించారు. ఇలా నిర్భంధాల నడుమ కేసిఆర్ పర్యటన కొనసాగడంపై బిజెపి నేత విజయశాంతి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా సీఎం కేసిఆర్ టూర్‌లో ప్రజల్ని రోడ్ల మీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసిఆర్‌కే చెల్లిందంటూ ఆమె దుయ్యబట్టారు. కేసిఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే... దాని బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో నేరుగా కేసీఆర్ గారికి అక్కడికి పోయే ధైర్యం లేకనే అటుపక్క సిద్ధిపేట జిల్లా, ఇటుపక్క వరంగల్ జిల్లా, యాదాద్రి జిల్లా పర్యటన చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక సీఎం కేసిఆర్ పర్యటనలో పర్యటనలో కొందరు పోలీసు అధికారులు - కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడింది.. ఇలా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికింది.మరోవైపు పేరుకే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. ఇవి కేవలం సీఎం టైంపాస్ మాత్రమే ఉపయోగపడతాయని ఎద్దెవా చేశారు.

Published by:yveerash yveerash
First published:

Tags: CM KCR, Vijayashanthi

ఉత్తమ కథలు