Home /News /telangana /

BJP LEADER VIJAYASHANTHI CRITICIZED TELUGU TOP HEROES MEGASTAR CHIRANJEEVI AND NAGARJUNA PRV

Chiranjeevi | Nagarjuna: మెగాస్టార్​ చిరంజీవి, నాగార్జునలపై సీనియర్​ హీరోయిన్​  ఫైర్​​..! అసలేం చేస్తున్నారంటూ..

నాగార్జున, చిరంజీవి (ఫైల్​)

నాగార్జున, చిరంజీవి (ఫైల్​)

ఎక్కువగా మీడియా ముందుకు రాకపోయినా వచ్చిన ప్రతీసారి కేసీఆర్​, కాంగ్రెస్​లపై విరుచుకుపడేవారు విజయశాంతి. అయితే ఆమె తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీపై ధ్వజమెత్తింది. అందులోనూ మెగాస్టార్​ చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలపై పరోక్షంగా మండిపడింది. అసలేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  విజయశాంతి (Vijaya shanti). అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్​ హీరోయిన్​గా కొనసాగిన నటి. మెగాస్టార్​ చిరంజీవి (Megastar Chiranjeevi), నాగార్జున (Nagarjuna), బాలకృష్ణ, వెంకటేశ్​ తదితర హీరోలతో ఆడీ పాడారు కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి బిజీబిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఆమె తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది. ఎక్కువగా మీడియా ముందుకు రాకపోయినా వచ్చిన ప్రతీసారి కేసీఆర్ (KCR)​, కాంగ్రెస్​లపై విరుచుకుపడేవారు విజయశాంతి. అయితే ఆమె తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీపై ధ్వజమెత్తారు. అందులోనూ మెగాస్టార్​ చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలపై పరోక్షంగా మండిపడ్డారు. అసలేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకూ ఒకప్పటి మన సీనియర హీరోయిన్​ విజయశాంతి ఈ సీనియర్​ హీరోలపై మండిపడటానికి కారణమేంటి? ఒకసారి తెలుసుకుందాం..

  దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించింది..

  అమీర్​ఖాన్​... ఇండియా గర్వపడే సినీ తారల్లో ఆయనొకరు. ఇప్పుడాయన లాల్​ సింగ్​ చద్దా అనే మూవీతో వస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్​లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో తెగ తిరిగేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనపై సీనియర్​ హీరోయిన్​, బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. బీజేపీ (BJP) సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారని విజయశాంతి గుర్తు చేశారు.  భారత్‌లో అసహనం పెరిగిపోయిందని… ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆమీర్ అన్నారన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో… ఇప్పటికీ పొందుతున్నారో… చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది అన్నారు విజయశాంతి.  ‘‘మనకి స్వాతంత్య్రం రావడానికి ముందు, తర్వాత, నేడు… ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ఆమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ, వాస్తవమేంటో తెలిసిన ప్రజలు ఆమీర్ (Amir Khan) వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు”అని ఆమె చెప్పుకొచ్చారు.

  కాగా, గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ (Hindu) వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా (Lal Singh Chaddha)’ అనే మూవీతో ముందుకొస్తున్నారు. కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని ఆమీర్… గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే…. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు , ఆమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలని ఈ సీనియర్​ హీరోయిన్​ చురకలు అంటించారు .  కాగా, గత కొద్దిరోజుల నుంచి లాల్​సింగ్​ చద్దా ప్రమోషన్​లో అమీర్​ఖాన్​తో ఇటు చిరంజీవి, అటు నాగార్జునలు పాలుపంచుకుంటున్నారు. ఈనేపథ్యంలో విజయశాంతి కామెంట్స్​ హాట్​ టాపిక్​గామారాయి. ఇరువురినీ పేర్లు పెట్టి విమర్శించకున్నా.. ఈ వ్యాఖ్యలు వారినే అన్నట్లుగా తెలుస్తోంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aamir Khan, Chiranjeevi, Nagarjuna Akkineni, Telugu movies, Tollywood, Vijayashanthi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు