హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pranahita pushkaralu: నెలరోజుల్లోనే పుష్కరాలు.. అయినా మొదలుకాని పనులు.. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విజయశాంతి ధ్వజం

Pranahita pushkaralu: నెలరోజుల్లోనే పుష్కరాలు.. అయినా మొదలుకాని పనులు.. టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై విజయశాంతి ధ్వజం

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలు జరగబోతున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. అయితే పనులు మొదలుపెట్టకపోవడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలు (Pranahita Pushkaralu) జరగబోతున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు  (Pranahita Pushkaralu) నిర్వహించేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు  పనులు కార్యరూపం దాల్చలేదు. దీంతో బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (BJP leader and former MP Vijayashanti) తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరగనున్న ప్రాణహిత పుష్కరాల (Pranahita Pushkaralu) పై కేసీఆర్ (KCR) సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విజయశాంతి మండిపడ్డారు.

  ఏప్రిల్ 13 నుంచి 24 వరకు..

  గురువారం ఫేస్‌బుక్ వేదికగా సీఎం కేసీఆర్‌ (CM KCR)పై విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో పోస్టు చేశారు.  ‘ఎంతో ఘ‌నంగా నిర్వహించాల్సిన పుష్కరాల (Pranahita Pushkaralu) పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు  (Pranahita Pushkaralu) నిర్వహించేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేశారు.

  కేసీఆర్ గవర్నమెంట్ స్పందించలేదు..

  పుష్కర ఘాట్ల (Pushkara Ghats) దగ్గర భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు వివిధ డిపార్ట్‌మెంట్ల ద్వారా భూపాలపల్లి జిల్లాలో 22.70 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 13 కోట్లతో ప్రపోజల్స్ ​పంపగా.. ఇంతవరకూ కేసీఆర్ గవర్నమెంట్ స్పందించలేదు. బంగారు తెలంగాణ చేశామ‌ని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. నెల రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నా.. ఇంకా ఘాట్ల వద్ద ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం 2010 డిసెంబర్‌లో ప్రాణహిత పుష్కరాలు (Pranahita Pushkaralu) వచ్చాయి.

  అప్పటి పాల‌కులు కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగానే నిర్వహించారు. స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ నుంచి రూ.1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ.8 కోట్లు కేటాయించారు. అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా ఈ పుష్కరాల్లో పాల్గొన్నారు. కానీ స్వంత రాష్ట్రంలో మొద‌టిసారిగా జ‌రుగుతున్నా పుష్కరాల‌ను  (Pranahita Pushkaralu) మాత్రం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పటికైనా పుష్కరాల‌కు నిధులు విడుద‌ల చెయ్ కేసీఆర్.. నీకంటే ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలే న‌యం’ అని విజయశాంతి విమర్శించారు.


   అక్టోబర్​లో సమీక్ష..

  కాగా, గత  అక్టోబర్​లోనే పుష్కర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి రివ్యూ చేశారు. ఎక్కడ ఏ పనులు చేపట్టాలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఆయన సూచనలతో భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా ఆఫీసర్లు రూ.35 కోట్ల అంచనాలతో ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్‌‌కు పంపించారు.

  2010లో పుష్కరాలు..

  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2010 డిసెంబర్​లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం కిరణ్‌‌ కుమార్‌‌ రెడ్డి ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ నుంచి రూ. 1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ. 8 కోట్లు కేటాయించి.. సీఎం స్వయంగా హాజరయ్యారు. అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు చేశారు. టీఆర్​ఎస్​ అధినేత , ప్రస్తుత సీఎం కేసీఆర్, అప్పుడు ప్రజారాజ్యం చీఫ్​గా ఉన్న చిరంజీవి తదితరులు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వద్ద పుష్కరాల్లో పాల్గొన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Telangana, Telangana bjp, Trs, Vijayashanthi

  ఉత్తమ కథలు