'మద్యం వల్లే దిశ హత్య'.. కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్.. మద్యం రాష్ట్రంగా మార్చారని విరుచుకుపడ్డారు. మద్యం వల్లే దిశ హత్య జరిగిందని.. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: December 12, 2019, 6:43 PM IST
'మద్యం వల్లే దిశ హత్య'.. కేసీఆర్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
రాజాసింగ్, కేసీఆర్ (File)
  • Share this:
దిశా హత్య ఘటన కేంద్రంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసింది కేంద్రం. మద్యం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని.. దిశా హత్య ఘటనకు మద్యమే కారణమని విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్‌తో డీకే అరుణ నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద మహిళా సంకల్ప దీక్షను చేపట్టింది బీజేపీ. ఈ కార్యక్రమానికి హాజరై ప్రసగించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్.. మద్యం రాష్ట్రంగా మార్చారని విరుచుకుపడ్డారు.

మద్యం వల్లే దిశ హత్య జరిగిందని.. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ధ్వజమెత్తారు రాజాసింగ్. దిశా లాంటి ఘటనలను ఇకపై జరగబోవని కేసీఆర్ హామీ ఇవ్వగలరా అని నిలదీశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. బడి లేదు.. గుడి లేదు.. ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్ముతున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఏం చేయదల్చుకున్నారో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు లక్ష్మణ్. కాగా, శుక్రవారం సాయంత్రం వరకు డీకే అరుణ మహిళా సంకల్ప దీక్ష కొనసాగనుంది.

First published: December 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>