Home /News /telangana /

Telangana Politics: తెలంగాణ మాజీ ఎంపీతో బీజేపీ చర్చలు... త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన

Telangana Politics: తెలంగాణ మాజీ ఎంపీతో బీజేపీ చర్చలు... త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన

కొండా విశ్వేశ్వర్ రెడ్డి(ఫైల్ పొటో)

కొండా విశ్వేశ్వర్ రెడ్డి(ఫైల్ పొటో)

Konda Vishweshwar Reddy: ప్రస్తుతం ఏ పార్టీలో లేని కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండే పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.

  తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. బీజేపీలో చేరే విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వచ్చే వారం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అంచనాల్లో కమలనాథులు ఉన్నారు. ఇదే సమయంలో మరికొందరు నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు టీఆర్ఎస్‌ తరపున ఎంపీగా గెలిచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కొంతకాలం క్రితం కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

  ప్రస్తుతం ఏ పార్టీలో లేని కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉండే పార్టీలో చేరాలని యోచిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈటల రాజేందర్‌తో సమావేశమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆయనతో పాటే బీజేపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. తాజాగా బీజేపీ ముఖ్యనేత, మాజీమంత్రి డీకే అరుణను కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డీకే అరుణ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

  సాధ్యమైనంత తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయనకు డీకే అరుణ సూచించినట్టు సమాచారం. దీనిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారని టాక్. అయితే ఈటల రాజేందర్‌తోపాటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారా ? లేక ఈ విషయంలో ఆయన మరింత సమయం తీసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈటలతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరితే.. తెలంగాణ రాజకీయాల్లో దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుందనే భావనలో కమలనాథులు ఉన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Konda Vishweshwar reddy, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు