Bandi Sanjay: హుస్నాబాద్‌లో బీజేపీ సభ.. అక్కడి నుంచి నేరుగా హుజూరాబాద్‌కు బండి సంజయ్..

బండి సంజయ్

Bandi Sanjay padayatra: ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మొత్తం 8 జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా.. 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు.

  • Share this:
    బీజేపీ (BJP) శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్రతో కార్యకర్తలు జోష్ మీదున్నారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra)ప్రారంభించి నేటికి 36 రోజులవుతోంది. ఐతే ఆ యాత్ర తొలి దశ నేటితో ముగియనుంది. వాస్తవానికి హుజురాబాద్ (Huzurabad)లో ముగింపు సభను నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రను హుస్నాబాద్ (Husnabad) వరకే పరిమితం చేశారు. అక్కడే తొలిదశ యాత్రను ముగించనున్నారు. యాత్ర ముగింపు సంధర్భంగా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)  ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలి వెళ్తున్నారు.

    Huzurabad: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. రంగంలోకి విద్యార్థి నేత.. టీఆర్ఎస్‌తో ఢీ

    పాదయాత్ర ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా హుజూరాబాద్ (Huzurabad) ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని పెట్టబోతున్నారు బండి సంజయ్. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి రాష్ట్రస్థాయి నేతలతో మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇవాళ హుస్నాబాద్‌లో యాత్ర ముగిసిన తరువాత హజూరాబాద్‌కు వెళ్తారు బండి సంజయ్. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత ఒకటి రెండు రోజుల పాటు హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు కరీంనగర్‌లోనే ఆయన ఉండనున్నట్లు తెలుస్తోంది.

    Huzurabad: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆస్తులు, అప్పులు ఇవే..

    ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. మొత్తం 8 జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా.. 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు.  ఇప్పటి వరకు మొత్తం 34 సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు బండి సంజయ్. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు వింటూ..  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి కూడా వివరిస్తున్నారు.  పాదయాత్ర పొడవునా రైతులు, నిరుద్యోగులు, మహిళల సహా వివిధ వర్గాల నుంచి సుమారు 11 వేలకి పైగా వినతి పత్రాలు ఆయన స్వీకరించారు. బండి సంజయ్ పాదయాత్రలో  ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: