మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితునిగా ఉన్న నందకుమార్ (Nandha Kumar) కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదు కాగా తాజాగా బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ కు చెందిన రియల్టర్ సిందేకర్ సతీష్ పై నందకుమార్ బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ (Nandha Kumar) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
సతీష్ కు అతని స్నేహితుని ద్వారా నందకుమార్ (Nandha Kumar) పరిచయమయ్యాడు. ఈ క్రమంలో సతీష్ తరచు నందకుమార్ ను ఫిలిం నగర్ లో కలిసేవాడు. అయితే ఆర్ధిక ఇబ్బందుల దృష్యా నందకుమార్ (Nandha Kumar) సతీష్ నుండి తరచూ డబ్బులు తీసుకొని తిరిగి మళ్లీ చెల్లించేవాడు. ఈ క్రమంలో నందు (Nandha Kumar) పై సతీష్ కు నమ్మకం పెరిగింది. ఇక 2018లో సతీష్ వికారాబాద్ జిల్లా దోమ మండలంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దీనికి నందకుమార్ (Nandha Kumar) మధ్యవర్తిత్వం చేశారు. ఆ భూమిని కొనుగోలు చేసే క్రమంలో మొత్తం డబ్బును యజమానికి చెల్లించాడు. ఇక మధ్యవర్తిత్వం చేసిన నందకుమార్ (Nandha Kumar) కు సతీష్ కమీషన్ ఇవ్వబోయాడు. కానీ నందకుమార్ (Nandha Kumar) తనకు కమీషన్ వద్దని కొంత భూమిని ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీనితో సతీష్ 21 లక్షలు నందకుమార్ (Nandha Kumar) కు చెల్లించాడు.
విలువ పెరగడంతో మళ్లీ బెదిరింపులు..
అయితే కొన్నిరోజుల క్రితం అక్కడి భూములకు డిమాండ్ పెరగడంతో నందకుమార్ (Nandha Kumar) మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డాడు. తెలంగాణాలో రాబోయేది బీజేపీ సర్కార్ అని, తాను ఉప ముఖ్యమంత్రి అవుతానని సతీష్ ను నందకుమార్ (Nandha Kumar) బెదిరించసాగాడు. ఈ క్రమంలో మరికొంత డబ్బును నందకుమార్ (Nandha Kumar) కు చెల్లించాడు. కానీ అతను మాత్రం బెదిరింపులు చేయడం ఆపలేదు. ఇక ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ (Nandha Kumar) అరెస్ట్ అయ్యాడు. దీనితో దైర్యం తెచ్చుకున్న సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Highcourt, Hyderabad, Telangana, Trs, TRS MLAs Poaching Case