Home /News /telangana /

Dalita bandu : బీజేపీ డప్పుల మోత.. అనుమతి లేదన్న పోలీసులు..కొనసాగుతున్న ర్యాలీ

Dalita bandu : బీజేపీ డప్పుల మోత.. అనుమతి లేదన్న పోలీసులు..కొనసాగుతున్న ర్యాలీ

బీజేపీ ర్యాలీ..

బీజేపీ ర్యాలీ..

Dalita bandu : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చ హైదరాబాద్‌లో డప్పుల మోత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా.. బీజేపీ ఆగ్రనేతలు పాల్గోన్నారు.

ఇంకా చదవండి ...
    దళిత బంధును వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చ డప్పుల మోత కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టింది. నగరంలోని ఎల్బీ స్టేడీయం నుండి ట్యాంక్‌బండ్‌పై ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. కాగా డప్పుల మోతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్‌చుగ్ తోపాటు ఆపార్టీ సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గోన్నారు. ఈ సంధర్భంలోనే పార్టీ నేతలు బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీలో పాల్గోన్నారు.

    అయితే బీజేపీ నిర్వహిస్తున్న డప్పుల మోత కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. దీంతో ఎలాగైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పడంతో ఆ పార్టీ అగ్రనేతలు సైతం పాల్గొనడంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది.

    ఇది చదవండి :స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల


    హుజూరాబాద్ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీ దళిత బంధును ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని సుమారు రెండు వేల కోట్లతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఉప ఎన్నికల తర్వాత దళిత బంధును ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక చేసి రానున్న నాలుగైదు సంవత్సరాల్లో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

    వరి కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బియ్యాన్ని సేకరిస్తున్నామని ఆయన వివరించారు.. సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.

    ఇది చదవండి : కూరగాయల చాకుతో భర్తను చంపిన భార్య.. తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ ఆగ్రహం..


    వరి కోనుగోలుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరి పంటతో పాటు ఇతర అంశాలపై సరైన అవగాహాన లేకుండా భాద్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండి పడ్డారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వరి పంట ఎంత సాగు అవుతుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారీటి లేదని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని  ఆదుకోవడానికి యూపిఏ ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 26 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి బియ్యం కోనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. కాగా ఇది దేశంలోని పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా కొనుగులు చేస్తున్నామని చెప్పారు.ఇక ధర్నాలు చేస్తామంటూ.. నాలుకలు చీలుస్తామంటే భయపడే పరిస్థితి లేదని అన్నారు. బేషాజాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు..

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Dalitha Bandhu, Hyderabad, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు