హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మేనల్లుడు మృతి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో మేనల్లుడు మృతి..

కిషన్ రెడ్డి, ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి (ఫైల్)

కిషన్ రెడ్డి, ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి (ఫైల్)

Hyderabad: బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి (50) గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy)  ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి (50)ఇంట్లో (Jeevan Reddy) ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటీన కాంచన్ బాగ్ లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి నోయిడాలో (Noida)ఉన్నారు. ఈ వార్త తెలియగానే.. కిషన్ రెడ్డి వెంటనే హైదరాబాద్ కు (Hyderabad) బయలుదేరినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి.

ప్రస్తుతం ఆయన అకాల మరణంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుఖసాగరంలో మునిగిపోయారు. కిషన్ రెడ్డి అక్కాబావ కుటుంబం సైదాబాద్ వినయ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుతాయని కుటుంబసభ్యులు  తెలిపారు.  జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ వార్త తెలియగానే పలువురు బీజేపీ (Bjp) నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు.

First published:

Tags: Bjp, Hyderabad, Kishan Reddy, Telangana

ఉత్తమ కథలు