Eetala Rajender :ఈటెల రాకతో కరీంనగర్‌లో కమలం వికసించేనా...? ఉమ్మడి జిల్లాలో కమలం నేతల సంబురాలు..!

Maoist letter : ఈటల రాజేందర్ రాజీనామాపై మావోయిస్టుల లేఖ...! సీఎం కేసిఆర్..ఈటల రాజేందర్ ఇద్దరు ఒక్కటే...

Eetala Rajender :మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి బలం పుంజుకుంటుందని భాజపా నేతలు భావిస్తున్నారు..అయితే ఇందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అటుంచితే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో మాత్రం బిజెపి కార్యకర్తల్లో ఉత్సహాం నెలకొంది..జిల్లాలోని పలుచోట్ల పార్టీ జెండాలు ఎగరవేసి సంబురాలు జరుపుకోవడంతో కరీంనగర్ జిల్లాలో మాత్రం ఆ పార్టీకి కొంత కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

  • Share this:
కరీంనగర్ జిల్లా..
తేదీ.15.06.2021.
న్యూస్18 తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కారు దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆయన అచరులతో భాజపా తీర్థాన్ని పుచ్చుకోవడంతో కరీంనగర్ రాజకీయాలపై ఫోకస్ పడింది..అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌ నుండి ప్రాతినిథ్యం వహిస్తుండగా తాజాగా ఈటలతోపాటు జిల్లాకు చెందిన మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ , గండ్ర నళిని కమలం పార్టీలో చేరారు . దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం భాజపాకు మరింత బలం చేకూరినట్లయింది .

ఇక ఈటలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పలువురు ప్రజాప్రతినిధులు కాషాయదళంలో చేరడంతో కమలం పార్టీ మరింత వికసించేలా జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారాయి . సమీప భవిష్యత్తులోనూ ఈ పార్టీలోకి మరికొందరు వచ్చి చేరుతారనే విశ్వాసాన్ని ఈ నేతలు వ్యక్తం చేస్తున్నారు . మరోవైపు ఈటెల చేరికను స్వాగతించేలా నాలుగు జిల్లాల పరిధిలో కాషాయ దండు సంబురాల్ని జరుపుకొన్నారు . ఆనందాలతో మిఠాయిల్ని తోటి నాయకులకు అందించి ఆనంద డోలికల్లో మునిగితేలారు .

మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల చేరిక జరిగే రోజు నుంచే ఆ పార్టీ నాయకులు సమావేశాల్ని నిర్వహించడంతోపాటు జెండా విష్కరణ కార్యక్రమాల్ని పలు గ్రామాల్లో ప్రారంభించారు .ఐతే ఇది ఇలా ఉంటే ఈటెల బిజెపి పార్టీ లోకి రావడం తో ఈ సరైన 2023 తెలంగాణ లో బిజెపి పార్టీ అధికారంలో రానుందా..?అంటే అవును అంటున్నారు. పార్టీ శ్రేణులు... ఈటెల తో ఒక్కసారిగా బీజేపీ పార్టీ లో నయా జోష్ కనబడుతోంది. ఇప్పటికె తెలంగాణ బీజేపీ పార్టీ లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా మరో 6నెలల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగితే ఈటెల గెలిస్తే సంఖ్య బలం కూడా పెరుగుతుందని పార్టీ అంటున్నది. అసెంబ్లీలో లో ఈసారి టీఆరెస్ పార్టీ పై పెద్ద ఎత్తున ఈటెల బిజెపి నుండి తన గళం వినిపించనున్నారు.హుజురాబాద్ లో ఉప ఎన్నికల రావాలి ఈటెల గెలవాలి. అంటే ఇంకో ఆరు నెలలు వేచి చూడలిసిందే..మరి.
Published by:yveerash yveerash
First published: