Home /News /telangana /

BJP APPOINTED SPECIAL COMMITTEE AND IN CHARGE FOR GHMC ELECTIONS SK

GHMCపై బీజేపీ పెద్దల ఫోకస్.. ప్రత్యేక కమిటీ, ఇంచార్జిల నియామకం

బండి సంజయ్, కిషన్ రెడ్డి (File)

బండి సంజయ్, కిషన్ రెడ్డి (File)

గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ ఇంచార్జిలను నియమించింది.

    దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్య విజయంతో బీజేపీలో నయా జోష్ కనిపిస్తోంది. పార్టీ కేడర్ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. దుబ్బాకలో విజయం సాధించి దీపావళి వేళ సీఎం కేసీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ ఇంచార్జిలను నియమించింది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ ఇంచార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ను నియమించింది. సహ ఇంచార్జిలుగా కర్నాటక మంత్రులు సతీష్ రెడ్డి, సుధాకర్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఆశిష్, గుజరాత్ నేత ప్రదీప్ సిన్హ్ వాగేలాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

    అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా 23 సభ్యులతో కూడిన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీని నియమించారు. ఆ కమిటీకి కేంద్రహోంశాఖ సహాయక మంత్రి ఛైర్మన్‌గా, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇక మాజీ ఎంపీ వివేక్, గరికపాటి మోహన్ రావు, చింత రామచంద్రారెడ్డి జాయింట్ కన్వీనర్లుగా ఉంటారు. వీరితో పాటు డీకే అరుణ, మురళీధర్‌రావు, రాజాసింగ్, రామచంద్రరావు, అరవింద్, సోయం బాపూరావు, ఇంద్రసేనా రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మోత్కుపల్లి నర్సింహులు, రవీంద్ర నాయక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కే. రాములు, రాపోలు ఆనంద భాస్కర్, రఘునందన్ రావు, ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి సభ్యులుగా ఉంటారు.
    జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, GHMC, Hyderabad - GHMC Elections 2020, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు