హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam : ప్రసవ సమయంలో భార్య పక్కనే భర్త, శిశువు బొడ్డును కట్ చేసేది ఆయనే... తెలంగాణలో సరికొత్త విధానం

Khammam : ప్రసవ సమయంలో భార్య పక్కనే భర్త, శిశువు బొడ్డును కట్ చేసేది ఆయనే... తెలంగాణలో సరికొత్త విధానం

Khammam : ఖమ్మం మాతాశిశు ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యానికి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని భార్య ప్రసవం సమయంలో భర్తను కూడా వెంట ఉండెటట్టు చేసి ఆమెకు నార్మల్ డెలివరి చేశారు.

Khammam : ఖమ్మం మాతాశిశు ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యానికి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని భార్య ప్రసవం సమయంలో భర్తను కూడా వెంట ఉండెటట్టు చేసి ఆమెకు నార్మల్ డెలివరి చేశారు.

Khammam : ఖమ్మం మాతాశిశు ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యానికి శ్రీకారం చుట్టారు.. రాష్ట్రంలోని భార్య ప్రసవం సమయంలో భర్తను కూడా వెంట ఉండెటట్టు చేసి ఆమెకు నార్మల్ డెలివరి చేశారు.

  వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం సహజమే.. ఈ క్రమంలోనే మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్యులు చర్యలు చేపడుతున్నారు. అయితే వైద్య రంగంలో ఎక్కువగా మెడిసిన్ తోపాటు అత్యాధునిక యంత్రాలకు ప్రాముఖ్యత ఉంటుంది. దీంతో ఏ రకమైన క్రిటికల్ చికిత్సలైనా వాటిద్వారా సాధ్యం అవుతుంటుంది. దీనికి తోడు రోగి త్వరగా కోలుకోవడంతో పాటు చికిత్స సమయంలో మానసికంగా ఉండడం కూడా చాలా అవసరంగా వైద్యులు భావిస్తారు. అందుకే వారికి మనోధైర్యం ఇస్తుంటారు.

  ఈ క్రమంలోనే ఖమ్మం ప్రభుత్వ వైద్యులు మహిళల ప్రసవానికి సంబంధించి ఒక ఎక్స‌పర్మెంట్ చేశారు..ఇది విదేశాల్లో ఉన్న ప్రాక్టిస్ అయినా తెలంగాణలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి చూపించారు. ముఖ్యంగా ఇటివల మహిళలు గర్భం ధరించిన తర్వాత ఎక్కువగా సిజేరియన్స్ ద్వారానే జరుగుతున్నాయి. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిజేరియన్స్ ద్వారా వారికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఇటివల నార్మల్ డెలివరిలు అయ్యె విధంగా వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రవైట్ రంగంలో కూడా ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.

  Karimnagar : పసిప్రాయంలోనే పర్యావరణపై మమకారం.. చెట్ల పెంపకానికి ఏం చేస్తుందంటే...


  అయితే నార్మల్ డెలివరిలు అయ్యెందుకు ఖమ్మం మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బర్త్ కంపానియన్ విధానంలో అంటే భర్త ముందే మహిళకు డెలివరి చేశారు. భార్య డెలివరి సమయంలో భర్త గాని లేదా వారికి ఇష్టమైన వ్యక్తులు గాని పక్కన ఉండడం వల్ల గర్భిణిలు ఎలాంటీ టెన్షన్ లేకుండా సుఖ ప్రసవం అయ్యె అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్న నేపథ్యంలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టామని చెబుతున్నారు. భర్త పక్కనే ఉండడం ద్వారా నార్మల్ డెలివరి అయ్యెందుకు సహకరించే హర్మోన్స్ కూడా వారికి త్వరగా విడుదల అవుతాయని దాని ద్వారా నార్మల్ డెలివరి అవుతారని చెబుతున్నారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో భర్తతోనే శిశువు బొడ్డు కూడా కట్ చేయించారు. దీంతో ఆ తండ్రికి కూడా పట్టలేని ఆనందం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు మహిళలు డెలివరి సమయంలో పడే నొప్పులు వర్ణనాతీతంగా ఉంటాయనేది వైద్యులు చెబుతుండగా వాటిని భర్తలు చూడడం ద్వారా మహిళలకు మరింత విలువ గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఉండడంతో పాటు వారిలో మానసిక పరివర్తన రావడం కూడా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

  Khammam politics : అక్కడ ఇక సీనియర్ల ఆట కట్‌.. జిల్లాలో కేసీఆర్‌ మార్కు పాలిటిక్స్‌..

  ఈ క్రమంలోనే ఖమ్మం మాతాశిశు సంరక్షణ కేంద్రం హెచ్‌వోడి క‌ృపా ఉషశ్రీ ఆధ్వర్యంలోని వైద్య బృందం నగరానికి చెందిన గర్భిణి శ్రీలతకు ఈ ఆధునూతన పద్దతిలో డెలివరి చేశారు. కాగా ఈ విధానం విదేశాల్లో చాలా సంవత్సరాల క్రితం నుండే ఉందని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రవైట్ ఆసుపత్రుల్లో కూడా భర్తలను అనుమతించే పద్దతి కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు వైద్యులు.

  First published:

  Tags: Khammam, Telangana

  ఉత్తమ కథలు