హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bird Flu: బర్డ్‌ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రి తలసాని అత్యవసర భేటీ

Bird Flu: బర్డ్‌ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. మంత్రి తలసాని అత్యవసర భేటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bird Flu: బర్డ్ ఫ్లూ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం 1300 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పౌల్ట్రీ రైతులకు సలహాలు సూచలు ఇవ్వాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా పలు చోట్ల బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, గుజరాత్‌తో పెద్ద మొత్తంలో కోళ్లు, నెమళ్లు, బాతులు, కాకులు మరణిస్తున్నాయి. వలస పక్షుల వల్లే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విస్తరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో బర్డ్ ఫూ రాకుండా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. వలస పక్షల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని.. కోళ్ల ఫారాల్లో చనిపోయో కోళ్ల శాంపిల్స్ వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (VBRI)కి పంపించాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫారాల్లో అక్కడక్కడా కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి.. పరీక్షలు చేయాలని చెప్పారు.

సినిమా పెద్దలతో మంత్రి తలసాని భేటీ (talasani srinivas yadav)
తలసాని శ్రీనివాస్ యాదవ్

బర్డ్ ఫ్లూ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం 1300 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పౌల్ట్రీ రైతులకు సలహాలు సూచలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి బర్డ్ ఫ్లూ వ్యాపించే అవకాశం తక్కువని..కానీ విదేశాల నుంచి వలస వలస పక్షులతో వ్యాప్తి చెందవచ్చని అధికారులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వివరించారు. శీతాకాలం నేపథ్యంలో రాబయే రోజుల్లో పౌల్ట్రీ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ షకీల్ చెప్పారు. దేశంలోని అతి పెద్ద పౌల్రీ పరిశ్రమల్లో తెలంగాణ కూడా ఒకటని.. ఈ నేపథ్యంలో బయో సెక్యూరిటీతో పాటు ఇతర అంశాల్లో జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేశారు.

బర్డ్ ఫ్లూ నేపథ్యంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు.. పలు చోట్ల చికెన్, గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్ జిల్లాలోనూ చికెన్,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. 15 రోజుల పాటు షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆయా ప్రాంతాలకు కోళ్ల సరఫరాను నిలిపివేశారు.

బర్ల్ ఫ్లూ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాదు ఈ సీజన్‌లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. ఈ నేపథ్యంలో వాటిపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.

First published:

Tags: Bird Flu, Talasani Srinivas Yadav, Telangana

ఉత్తమ కథలు