Bird Flu: బర్డ్ ఫ్లూ కలవరం.. తెలంగాణలోని ఆ గ్రామంలో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డ కోళ్లు

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో మేత‌కు వెళ్లిన కోళ్లు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి. అలా పడిపోయిన కొద్ది సేప‌టికే మృత్యువాత పడుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ఈ కోళ్లు ఎందుకు మృతి చెందుతున్నాయోనని ఆందోళ‌న చెందుతున్నారు. వివిద రాష్ట్రాల్లోలాగా తెలంగాణలోని మన ప్రాంతానికి కూడా బర్డ్ ఫ్లూ వ‌చ్చిందా?

  • Share this:
    అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్న బ్లర్డ్ ఫ్లూ తెలంగాణలోనూ భయాందోళనలను రేకెత్తిస్తోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ రేటు కూడా నేల చూపులు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లెక్కకు మించిన కోళ్లు కుప్పలు కుప్పలుగా చనిపోవడంతో ప్రజలు డైలమాలో పడుతున్నారు. అవి బర్డ్ ఫ్లూ వలన చనిపోయాయా..? లేక మరేదైనా కారణమా? అన్నది తెలియక ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో జరిగిన ఘటన స్థానికుల్లో చర్చనీయాంశమయింది. వర్ని మండలం జలాల్పూర్ లో మేతకు వెళ్లిన కోళ్లు ఎక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. అంతకుముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా ఎందుకు మరణించాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

    నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో మేత‌కు వెళ్లిన కోళ్లు ఎక్కడికక్కడే పడిపోతున్నాయి. అలా పడిపోయిన కొద్ది సేప‌టికే మృత్యువాత పడుతున్నాయి. దీంతో గ్రామ‌స్తులు ఈ కోళ్లు ఎందుకు మృతి చెందుతున్నాయోనని ఆందోళ‌న చెందుతున్నారు. వివిద రాష్ట్రాల్లోలాగా తెలంగాణలోని మన ప్రాంతానికి కూడా బర్డ్ ఫ్లూ వ‌చ్చిందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేతకు వెళ్లిన కోళ్లు ఎందుకు మృతి చెందాయోనని కోళ్ల ఫారం యజమానులు కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.

    చనిపోయిన కోళ్లను ఊరికి దూరంగా పారేయకుండా భూమిలో పూడ్చిపెట్టాల‌ని గ్రామ‌స్తులు కోరుతున్నారు. లేదంటే బర్డ్ ఫ్లూ యే అయి ఉంటే మరింత విస్తరిస్తుందని భయపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామంలో పర్యటించి, దీనికి కారణం ఏంటో తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. లెక్కకు మించిన కోళ్లు ఊహించని రీతిలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో చికెన్ రేటు కూడా ఎన్నడూ లేని రీతిలో నేల చూపులు చూస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే కిలో కేవలం 50 రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. వైద్యాధికారులు సత్వరమే స్పందించి నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ వైద్య శాఖ మంత్రి కూడా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
    Published by:Hasaan Kandula
    First published: