Bird flu: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు, అమ్మకాలు

Bird flu: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు, అమ్మకాలు

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్ ప్లూ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది.

  • Share this:
    దేశంలో ఓ వైపు కరోనా, మరోవైపు బర్డ్ ప్లూ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. ఇప్పటి వరకు కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. బర్డ్ ప్లూ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. పలు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలలో బర్డ్ ప్లూ విస్తరించిందా? లేదా? అనే విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలో బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. బర్డ్ ప్లూ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పశుసంవర్ధక శాఖ హెచ్చరించింది.

    బర్డ్ ఫ్లూ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే చికెన్ అమ్మకాలు పడిపోయాయి. అలాగే చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే బర్డ్‌ ఫ్లూ ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా చికెన్ ధరలు, అమ్మకాలు తగ్గిపోయాయి. వారం రోజుల కిందటవరకు రూ. 230 నుంచి రూ. 240 పలికిన చికెన్ ధరలు(స్కిన్ లెస్).. ప్రస్తుతం రూ. 160 నుంచి రూ. 170కి చేరాయి.అలాగే చికెన్ అమ్మకాలు కూడా 30 శాతం మేర పడిపోయినట్టుగా మార్కెట్ వర్గాలు తెలిపాయి..

    ఇక, పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు లేవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు