హోమ్ /వార్తలు /తెలంగాణ /

SangaReddy: చూస్తుండగానే.. కళ్లు మూసి తెరిచే గ్యాప్‌లో.. ఫ్యామిలీ మొత్తం రోడ్డు దాటుతుండగా...

SangaReddy: చూస్తుండగానే.. కళ్లు మూసి తెరిచే గ్యాప్‌లో.. ఫ్యామిలీ మొత్తం రోడ్డు దాటుతుండగా...

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

జిల్లాలోని రామచంద్రపురం గండెమ్మ ఆలయం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న వారిని చూసి కూడా వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలోనే వారిని ఢీ కొట్టాడు.

ఇంకా చదవండి ...

  సంగారెడ్డి: జిల్లాలోని రామచంద్రపురం గండెమ్మ ఆలయం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ కుటుంబాన్ని వేగంగా వస్తున్న బైక్ (Bike) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న వారిని చూసి కూడా వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలోనే వారిని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా కిందపడ్డాడు. హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు దాటుతున్న వారిదే తప్పనట్టుగా వారిని తిట్టుకుంటూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీకెమెరాల్లో రికార్డ్ కావడం గమనార్హం. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.


  ఇటీవల మేడ్చల్ జిల్లా శామీర్‌పేట బస్టాండ్ సమీపంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూటర్‌పై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని మితిమీరిన వేగంతో వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వేగానికి స్కూటర్, బైక్ నుజ్జునుజ్జు కావడం గమనార్హం. మే 8న హైదరాబాద్‌లో జాగ్వార్ కారు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు.

  ఇది కూడా చదవండి: Very Sad: నెల రోజుల క్రితమే అమ్మ చనిపోయింది... ఆ బాధను దిగమింగుకుని ఆదివారం డ్యూటీకి వెళుతుండగా..

  మాదాపూర్ ఫ్లై ఓవర్ (Madhapur FlyOver) దగ్గర రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని.. కేపీహెచ్‌బీ కాలనీ నుంచి మాదాపూర్ వైపు వెళుతున్న జాగ్వార్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ స్పాట్‌లోనే చనిపోయాడు. మేలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండటం.. రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో ఆ ఖరీదైన కారు నడిపిన వ్యక్తి విచక్షణ కోల్పోయి మితిమీరిన వేగంతో డ్రైవ్ చేశాడు. అతని డ్రైవింగ్ సరదా ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bike accident, Sangareddy, Telangana crime news, Telangana updates

  ఉత్తమ కథలు