హోమ్ /వార్తలు /తెలంగాణ /

Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు..

Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు..

bike fire

bike fire

Aadilabad : ఆదిలాబాద్‌లో ఓ టూవీర్ వాహానదారుడు ట్రాఫిక్ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. బైకుపై ఈ చాలన్లు వేస్తుండడంతో విసుగు చెంది తన టూ వీలర్‌ను తానే పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

ఆదిలాబాద్‌ ( Adilabad ) పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన మక్బూల్‌ అనే వ్యక్తి స్థానిక అంబేడ్కర్‌ కూడలి సమీపంలోబైక్‌పై వెళుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు ( Traffic police ) ఫొటో తీసి ఈ-చలానా కింద జరిమానా వేశారు. దీంతో అసహనానికి గురైన వాహనదారుడు తరచూపోలీసులు చలాన్లు ( Traffic challans ) వేస్తున్నారంటూ నడిరోడ్డుపై తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. గమనించిన పోలీసులు మంటలను ఆర్పేశారు.

అయితే ఇటివల ఇలాంటీ సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది నెలల క్రితం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఓ ఆటో కార్మికుడు కూడా ఇదే విధంగా చాలన్ల పేరుతో వేధించడతో తన ఆటోను తానే పెట్రోలో పోసి తగుల బెట్టిన పరిస్థితి ఎదురైంది.

Karimnagar : ఆన్‌లైన్‌లో ప్రేమ ..ఆర్యసమాజ్‌లో పెళ్లి.. కట్ చేస్తే


ముఖ్యంగా ట్రాఫిక్ రూల్సు ( Traffic rules ) పేరుతో ఆదాయాన్ని నింపుకునే ప్రయత్నం చేయడమే ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. దీంతో వినియోగదారుల్లో ఆసహనం పెరుగుతోంది. ఇలా రూల్సు పేరుతో .. బైకు రొడ్డెక్కితే చాలు ట్రాఫిక్ పోలీసుల కెమెరా కళ్లు క్లిక్‌మనిస్తున్నాయి. హెల్మెంట్ లేకున్నా.. సీటు బెల్టు పెట్టుకోకున్నా చాలు వేల రూపాయల చాలన్లు రయ్య్‌మని ఇంటివస్తున్నాయి. దీంతో వాహానదారులు బెంబెలెత్తుతున్నారు. ఓ వైపు పెట్రోల్ ధరలు ఆకాశనంటుండగా మరోవైపు ట్రాఫిక్ రూల్స్ పేరుతో వేల రూపాయలను జరినామాలు వేస్తుండడం నిజంగా టూ వీలర్‌తో పటు వాహానాలు నడుపుతున్న వారికి కష్టంగానే మారింది.

Bandi sanjay : సీఎం కుట్రలకు ఢిల్లీ చెక్ పెట్టింది.. కేసిఆర్ పతనం ఆరంభమైంది


ముఖ్యంగా హైదరాబాద్ తోపాటు ( Hyderabad traffic ) ఇతర ట్రాఫిక్ ఉన్న నగరాల్లో అయితే ట్రాఫిక్ రూల్స్ అంటే బాగానే ఉంది . కాని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ దోపిడి ఆధికమైంది. కనీస ట్రాఫిక్ కూడా కొన్ని జిల్లా కేంద్రాల్లో పోలీసులు గుంపులు ,గుంపులు గా చేరి ఒక్కసారిగా వాహానదారుల మీద పడుతున్నారు. ఇలా రోజువారిగా కాకుండా ఆదాయమే పరమావధిగా పోలీసులు జరినామాలు విధిస్తున్నారు. దీంతో కనీసం టూవీలర్ అమ్మినా కూడా జరిమానాలు కట్టలేని స్థితికి వాహానదారులను తీసుకువెళ్లారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరు విమర్శల పాలు అవుతుంది. దీంతో ఇప్పటికైనా నిజంగా ట్రాఫిక్ రూల్సు అవసరమైన చోట జరిమానాలు విధిస్తే బాగుంటుందని వాహానాదారులు కొరుతున్నారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Adilabad, Traffic challan

ఉత్తమ కథలు