Jail Gang : జైలులో జత కట్టారు... స్పీడ్‌ బైక్‌లపై కన్నేశారు.. బైక్‌పై కూర్చుని.. క్షణాల్లో..

Jail Gang : జైలులో జత కట్టారు... స్పీడ్‌ బైక్‌లపై కన్నేశారు.. బైక్‌పై కూర్చుని.. క్షణాల్లో..

Jail Gang : జైలులో కలిసిన యువకులు గ్యాంగ్‌గా మారారు. అందరు 25 సంవత్సరాలలోపు వారే కావడంతో ఒక్కటిగా జట్టుకట్టారు. జైలు జీవితం మార్పు తెస్తుందనుకుంటే వారిని మరిన్ని నేరాలకు పాల్పడేవిధంగా తయారైంది..

 • Share this:
  సాధారణంగా జైలుకు ( jail ) వెళ్లిన వారు మార్పుతో బయటకు వస్తారని అంతా భావిస్తారు. అయితే కొద్ది మందిలో మార్పు వస్తుంది. చాలా మందిలో మరో కొత్త జీవితానికి నాంది పలుకుతోంది. నేరాలు చేసిన వారు ఇక తమ జీవితంలో తిరిగి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండక పోవడంతో మరింత క్రిమినల్స్‌గా మారుతున్నారు. ఈ క్రమంలోనే జైలులో కలుసుకున్న యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి మరింత కరడు గట్టిన దొంగలుగా మారారు..

  చిన్న చిన్న దొంగతనాలు ( theft ) చేసి జైలు పాలయ్యారు.. అక్కడే జట్టుగా ఏర్పడి ఓ ముఠాను ( gang ) తయారు చేసుకున్నారు.. క్షణాల్లో వాహనాలను దొంగలించి వాటిని విక్రయించి.. వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే వారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. నలుగురు నిందితులతో పాటు వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని బాలానగర్‌ సీసీఎస్, దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

  ఇది చదవండి :  దివ్వాంగురాలు ఇంటికి మధ్యాహ్నం పూట ఒక్కడే.. వెళ్లాడు.. కట్ చేస్తే.. ?

  వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం తుమ్మన్‌పేట్‌ గ్రామానికి చెందిన చింతల బాలరాజు(23) ఐడిఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో నివసిస్తున్నాడు. బైక్‌ మెకానిక్‌ అయిన బాలరాజు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాహనాలను తస్కరించడంలో ఆరి తేరిన బాలరాజు ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటిని విక్రయిస్తూ జల్సాలు చేయడం మొదలు పెట్టాడు.: పలు దొంగతనాలు చేసి జైలు పాలైన చింతల బాలరాజు వివిధ నేరాలకు పాల్పడి జైలుకు వచ్చిన వారితో జట్టు కట్టాడు.

  ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాకు చెందిన రతస్వామి(19), మెదక్‌ జిల్లాకు చెందిన ఏర్వ విజయ కృష్ణ(24), మేడ్చల్‌ కు చెందిన బర్దసారి సుభాష్‌ (21), బండ్లగూడకు చెందిన షేక్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఆలం(20), ఐడిఏ బొల్లారం పోచమ్మబస్తీ నివాసి మహ్మద్‌ సోహైల్‌(19) లు ముఠాగా ఏర్పడి వాహనాలను చోరీచేసి విక్రయించేవారు.

  ఇది చదవండి : బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?


  ఇలా.. ఆరుగురూ కలిసి మద్యం తాగిన అనంతరం ముందుగా పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు... వాహనంపై కూర్చున్నట్లు నటించి హ్యాండిల్‌ లాక్‌ విరగొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయిస్తారు. అయితే ఇప్పటి వరకు చోరీ చేసిన వాహనాలన్ని హైస్పీడ్‌ స్పోర్ట్స్‌ బైక్‌లే కావడం విశేషం.

  వీటిని చందానగర్, ( chandanagar ) శాంతినగర్‌కు చెందిన కల్లమల్ల దీపక్‌(21), మౌలాలీ, గాందీనగర్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌(20)లకు కేవలం రూ.20 వేలకు విక్రయించారు. వీరి ద్వార విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం నిందితులు చింతల బాలరాజు, సుభాష్, అబ్దుల్‌ ఆలం, సోహేల్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన దీపక్, అన్వర్‌లను అరెస్ట్‌ ( arrest ) చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.45.85 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
  Published by:yveerash yveerash
  First published: