హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీవీ9లో చేరిన బిగ్ బాస్ నటి.. బిత్తిరి సత్తికి సర్‌ప్రైజ్

టీవీ9లో చేరిన బిగ్ బాస్ నటి.. బిత్తిరి సత్తికి సర్‌ప్రైజ్

శివజ్యోతి

శివజ్యోతి

V6లో సావిత్రి పేరుతో బాగా పాపులరైన శివజ్యోతి.. బిగ్ బాస్‌ హౌస్‌లో మాత్రం తన ఒరిజినల్ పేరు (శివజ్యోతి)తోనే కంటిన్యూ అయింది. మరి ఆ ఛానెల్‌లోనూ సావిత్రి పేరుతో సందడి చేస్తుందా? లేదంటే కొత్త పేరేమైనా పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇంకా చదవండి ...

V6 చానెల్‌లో తీన్మార్ వార్తలతో సందడి చేసిన శివజ్యోతి అలియాస్ సావిత్రి.. మూడు నెలల క్రితం ఆ ఛానెల్‌కు దూరమైంది. బిగ్ బాస్ షోలో అవకాశం రావడంతో సుమారు 100 రోజుల పాటు 'మా టీవీ స్క్రీన్‌పై కనిపించింది. సావిత్రి బిగ్ బాస్‌కు వెళ్లిపోయిన కొన్ని రోజులకే చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సైతం V6 ఛానెల్ నుంచి బయటకు వచ్చేశారు. టీవీ9 ఛానెల్‌లో చేరి ఇస్మార్ట్ సత్తిగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఐతే కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ గేమ్ షో పూర్తవడంతో శివజ్యోతి నెక్ట్స్ ఏం చేస్తుందన్న ప్రశ్న ఆమె అభిమానుల్లో తలెత్తింది. ఆ ప్రశ్నకు ఇవాళ సమాధానం వచ్చింది.

టీవీ స్క్రీన్‌పై తెలంగాణ యాసలో శివజ్యోతి మళ్లీ వార్తలు చదవబోతోంది. ఇటీవలే ఆమె టీవీ9 ఛానెల్‌లో చేరింది. V6లో సందడి చేసిన బిత్తిరి సత్తి-సావిత్రి కాంబినేషన్ ఇప్పుడు టీవీ9 స్క్రీన్‌‌పై కొనసాగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదల చేసింది టీవీ9. ఐతే V6లో సావిత్రి పేరుతో బాగా పాపులరైన శివజ్యోతి.. బిగ్ బాస్‌ హౌస్‌లో మాత్రం తన ఒరిజినల్ పేరు (శివజ్యోతి)తోనే కంటిన్యూ అయింది. మరి టీవీ9లో సావిత్రి పేరుతో సందడి చేస్తుందా? లేదంటే కొత్త పేరేమైనా పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Telangana, TV9

ఉత్తమ కథలు