హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ అప్డేట్..ఆ ముగ్గురికి షాక్ ఇచ్చిన సిట్..!

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ అప్డేట్..ఆ ముగ్గురికి షాక్ ఇచ్చిన సిట్..!

PC: Twitter

PC: Twitter

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గూజిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆ ముగ్గురికి తాజాగా లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గూజిలకు సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ముగ్గురిని నిన్న విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చిన హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆ ముగ్గురికి తాజాగా లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇదే కేసులో ఆ ముగ్గురితో పాటు బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు.

Warangal: ఆటోని లాగడానికి వీళ్లు ఎందుకిత కష్టపడుతున్నారో చూడండి.. దీని వెనుక వేరే స్టోరీ ఉంది..

అందుకే టికెట్ బుక్ చేశానన్న శ్రీనివాస్..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నిందితుల్లో ఒకరైన తిరుపతికి చెందిన సింహయాజి అనే స్వామీజీకి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడనే అనుమానాలు వచ్చాయి. ఈ కారణంగానే అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు వచ్చిన శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయడంపై వివరణ ఇచ్చారు. తన ఇంట్లో పూజ చేయించుకోవాలని అనుకున్నాను. అందుకోసమే టికెట్ బుక్ చేశానని అధికారులకు చేప్పాడు. ఇక అతనిని 5 గంటలకు పైగా విచారించిన సిట్ అధికారులు నేడు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీనితో నేడు కూడా శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరు కానున్నాడు.

Warangal: ఆటోని లాగడానికి వీళ్లు ఎందుకిత కష్టపడుతున్నారో చూడండి.. దీని వెనుక వేరే స్టోరీ ఉంది..

లుక్ అవుట్ నోటీసులు అంటే ఏమిటి?

కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు. పరారీలో ఉన్నారు. కేసును నుండి తప్పించుకోడానికి వారు దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అందుకోసం అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేస్తూ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ కేసులో ఆ నలుగురికి ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్ పై సిట్ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అందులో పేర్కొన్నారు. అయినా కానీ ఆ నోటీసులతో తమకేం సంబంధం లేదన్నట్టు ఆ ముగ్గురు విచారణకు హాజరు కాకపోగా నోటీసులపై కూడా స్పందించలేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హైకోర్టు వారిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినా కానీ సిట్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అరెస్ట్ చేయగలదా అనే అనుమానం రాక తప్పదు.

First published:

Tags: Bjp, Hyderabad, Telangana, Trs, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు