హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు!

Big News: TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు!

PC: Twitter

PC: Twitter

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సిట్ షాకిచ్చింది. 41ఏ CRPC కింద విచారణకు రావాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది సిట్. కాగా ఈ కేసులో ఇప్పటికే BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుజీస్వామికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు సిట్ షాకిచ్చింది. రూ.100 కోట్లు సమకూరుస్తానని రఘురామ చెప్పినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనితో 41ఏ CRPC కింద విచారణకు రావాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది సిట్. కాగా ఈ కేసులో ఇప్పటికే BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుజీస్వామికి కూడా సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

  Minister Mallareddy: ఐటీ రైడ్స్ విషయం కేసీఆర్ ముందే చెప్పారు..మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

  బండి సంజయ్ అనుచరుడిని విచారించిన సిట్..

  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుజీస్వామి, బండి సంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆ నలుగురిలో కేవలం శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరయ్యారు. BL సంతోష్, జగ్గుజి, తుషార్ మాత్రం విచారణకు రాలేదు. కనీసం నోటీసులపై కూడా ఈ ముగ్గురు స్పందించలేదు.

  KCR: టీఆర్ఎస్‌తో కమ్యూనికేషన్ గ్యాప్.. సీపీఐ నేత కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ పట్టించుకోవడం లేదా ?

  తాజాగా మరో ఇద్దరికీ నోటీసులు.. 

  ఇక ఈ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒకరు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితునిగా ఉన్న నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ గా తెలుస్తుంది. అయితే తాను వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాలేక పోతున్నానని, మరో రోజు వస్తానని నందకుమార్ భార్య సిట్ కు చెప్పినట్లు తెలుస్తుంది.

  ఈ-మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలన్న హైకోర్టు..

  ఈ కేసులో BL సంతోష్ కు నోటీసులపై నిన్న తెలంగాణ హైకోర్టు విచారించింది. సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని, అది కూడా ఈ -మెయిల్ ద్వారా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దాని ప్రకారం సంతోష్ తో పాటు కేరళకు చెందిన తుషార్, జగ్గుజీస్వామికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case

  ఉత్తమ కథలు