ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు నేడు సింహయాజి జైలు నుండి బయటకు రాగ మరో ఇద్దరు నిందితులపై ఇతర కేసులు ఉండడంతో వారు జైల్లోనే ఉన్నారు. ఇక నిన్న ఈ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఏసీబీ కోర్టు (Acb Court) కొట్టివేసింది. ఈ కేసులో BL సంతోష్, తుషార్, శ్రీనివాస్ ను నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. దీనిపై నిన్న ఏసీబీ కోర్టు (Acb Court) విచారణ చేపట్టి కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సంబంధించి సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు (Acb Court) కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు (Acb Court) పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు (Acb Court) తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే (Acb Court) అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు (Acb Court) తీర్పుపై సిట్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 2.30 గంటల తరువాత విచారణ జరగనుంది.
ఇక TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామిలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నిన్న ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటిసులపై సంతోష్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా..డిసెంబర్ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) డిసెంబర్ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి (Jaggu Swami) సిట్ లుకౌట్ నోటిసులపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిలో కూడా నోటిసులపై స్టేను హైకోర్టు (High Court) పొడిగించింది. ఇప్పుడు శ్రీనివాస్ పై మెమో దాఖలును కొట్టివేయడంతో పోలీసులకు చుక్కెదురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case