ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. గతంలో దర్యాప్తుపై ఇచ్చిన స్టేను నేడు తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోరగా ఆ పిటీషన్ ను కోర్టు పెండింగ్ లో పెట్టింది. కోర్టు తీర్పుతో అటు నిందితులకు ఇటు బీజేపీకి షాక్ తగిలినట్లైంది. ఇప్పుడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు ఈ కేసుపై ముందుకెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా టీఆర్.ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఈనెల 26న మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. టీఆర్ఎస్ కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kanthrao), అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju), తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy)ని పార్టీ వీడాలని కాంట్రాక్టులు, పదవులు డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను బయటపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి (Rama chandra bhrathi), హైదరాబాద్ (Hyderabad) కు చెందిన నందూ కుమార్ (Nandukumar), తిరుపతికి చెందిన సింహయాజి (Simhayaji)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Big News: సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్..ఓఎంసీ కేసులో అభియోగాలు కొట్టివేసిన హైకోర్టు
ఫామ్ హౌజ్ కేసులో తమ అరెస్టును సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై మంగళవారం పిటీషన్ ను పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. తమ రిమాండ్ ను ఆపాలని రామచంద్రబారతి (Rama chandra bharathi), సింహయాజి (Simhayaji), నందుకుమార్ (Nandhu kumar) ల తరపు న్యాయవాది కోరగా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ఇక ఈ ఘటనపై బీజేపీ సీబీఐతో కానీ లేక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ప్రభుత్వం మాత్రం కేసు ప్రారంభ దశలోనే ఉంది అని వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు నిందితులకు ఝలక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు చేయడానికి పోలీసులకు లైన్ క్లియర్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.