హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్..హైకోర్టు కీలక ఆదేశాలు

Breaking News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్..హైకోర్టు కీలక ఆదేశాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి. అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయగా దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులు ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.

Cm Kcr: తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం..8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు నిన్న ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. నిందితులు రామచంద్రభారతి (Ramachandra Bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ కు నిరాకరించింది.

ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకం కానున్నట్లు తెలుస్తుంది. శరత్, ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని అక్కడే పోలీసు కమిషనరేట్ లో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొచ్చిన్ కు చెందిన జగ్గూజి అనే మరో స్వామిజి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తుషార్ కు, జగ్గూజికి మధ్య సంబంధాలపై, అలాగే ఆర్ధిక లావాదేవీలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.  ఇప్పటికే నిందితుల్లో ఒకరైన నందకుమార్ (Nandakumar) హోటల్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు.

First published:

Tags: Bjp, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case