• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • BHUPALPALLY ONE PERSON DIED AFTER SINGARENI OPENCAST VEHICLE HITS SU

సింగరేణి డంపర్ వాహనం బీభత్సం.. వ్యక్తి మృతి చెందడంతో వాహనాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు

సింగరేణి డంపర్ వాహనం బీభత్సం.. వ్యక్తి మృతి చెందడంతో వాహనాలను ధ్వంసం చేసిన గ్రామస్తులు

ప్రతీకాత్మక చిత్రం

Singareni: సింగరేణికి చెందిన డంపర్ వామనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

  • Share this:
    సింగరేణికి చెందిన డంపర్ వామనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుని భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్-1కు సమీపంలోని గడ్డిగానిపల్లికి చెందిన లింగయ్యగా గుర్తించారు. వివరాలు.. లింగయ్య చీపురు పుల్లలు సేకరించేందకు ఓపెన్‌కాస్ట్ మార్గంలో అడవికి బయలుదేరారు. అతడు వెళ్తుండగా ఓపెన్‌కాస్ట్‌కు చెందిన డంపర్ వాహనం వేగంగా దూసుకొచ్చి లింగయ్యను ఢీకొట్టింది. భారీ వాహనం కావడంతో లింగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సింగరేణి వాహనం ఢీకొని లింగయ్య మృతిచెందాడనే వార్త తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

    పెద్ద ఎత్తున సింగరేణి ఓపెన్‌కాస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న సింగరేణి వాహనాలపై దాడి చేశారు. ఈ దాడుల్లో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే గ్రామస్థులు పోలీసులు మాటలు పట్టించుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న సింగరేణి ఉన్నతాధికారులు గ్రామస్తులకు సముదాయించడానికి ప్రయత్నించారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది.

    ఇంకా, గడ్డిగానిపల్లి ప్రజలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా, డంపర్ వాహనం అదుపు తప్పడం వల్లనే ఈ ప్రమాద జరిగినట్టుగా తెలుస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు