జనగామ వరకు ఎంఎంటీఎస్.. రైల్వే అధికారులతో ఎంపీ చర్చలు

నియోజకవర్గలో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్ల విస్తరణపై చర్చించారు. నడికుడి మార్గాన్ని డబ్లింగ్ లైన్ చేయాలని.. చిట్యాల-సిరిపురం మధ్య గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు కోమటిరెడ్డి.

news18-telugu
Updated: November 15, 2019, 6:16 PM IST
జనగామ వరకు ఎంఎంటీఎస్.. రైల్వే అధికారులతో ఎంపీ చర్చలు
హైదరాబాద్ MMTS
  • Share this:
ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరి గుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరారు. భువనగిరి రైల్వే స్టేషన్‌లో శాతవాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యాతో ఎంపీ కోమటిరెడ్డి సమావేశమయ్యారు. తన నియోజకవర్గలో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్ల విస్తరణపై చర్చించారు. నడికుడి మార్గాన్ని డబ్లింగ్ లైన్ చేయాలని.. చిట్యాల-సిరిపురం మధ్య గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు కోమటిరెడ్డి.

అంతేకాదు రామన్న రైల్టే స్టేషన్‌లో పునర్నిర్మాణ పనులు చేపట్టి.. చెన్నై,శబరి, డెల్టా ప్యాసింజర్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనగామ స్టేషన్‌లో నాందెడ్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలన్నారు ఎంపీ. భువనగిరిలో ఆర్వో వాటర్ ప్లాంట్ సైతం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని...వీలైనంత త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Video: ఆర్టీసీపై కేసీఆర్‌ది అప్పడో మాట... ఇప్పుడోమాట: కోమటిరెడ్డి, Komatireddy Venkat reddy fires on cm kcr
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
First published: November 15, 2019, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading