ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికల్లో (Munugode Bypoll) కాంగ్రెస్‌కి మద్దతుగా ప్రచారం చేయకుండా... తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy RajagopalReddy)కి సహకరించారని ఆయనపై విమర్శలున్నాయి. అంతేకాదు.. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తెలంగాణలో కొనసాగుతున్నా.. ఇప్పటి వరకు వెళ్లలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది. ముఖ్యంగా తన తమ్ముడికి ఓటు వేయాలన్న ఆడియోపై ఆరాతీసింది.
కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించకపోవడంతో.. శుక్రవారం రెండోసారి నోటీసులు పంపించింది. ఐతే ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఐతే ఆస్ట్రేలియా నుంచే పార్టీ హైకమాండ్‌కు ఆన వివరణ ఇచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. పలు అంశాలను పేర్కొంటూ.. పూర్తి వివరణ ఇచ్చినట్లు సమాచారం. తన పేరిట ప్రచారం జరుగుతున్న ఆ ఆడియో తనది కాదని.. అది నకిలీదని కొట్టిపారేశారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగాఉన్నా.. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారట. ఉద్దేశ్యపూర్వకంగానే తనను కించపరుస్తున్నారని వివరించారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Big News: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీపై పోలీసుల సంచలన ప్రకటన
మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించి 10 రోజులవుతోంది. నారాయణపేట, మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్గాడి మీదుగా సాగిన పాదయాత్ర.. ప్రస్తుతం మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ముగియనుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్, ఇతర నేతలంతా రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ వెంకటరెడ్డి ఇప్పటి వరకు యాత్రకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి కనీసం ఇప్పటికైనా ఆయన భారత్ జోడో యాత్రకు వెళ్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాన్ని బట్టి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న దానిపై ఓ క్లారిటీ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కమలం గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమే అనే చర్చ జరుగుతోంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే.. వెంకట్ రెడ్డి ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Komatireddy venkat reddy, Telangana, TS Congress