Home /News /telangana /

BHOGI CELEBRATIONS WITH RYTHU BANDHU FLEXI IN KHAMMAM VRY

Khammam : ఇది కదా.. భోగి సంబరాలంటే.. డూడూ బసవన్నలతో రైతు బంధు సంబరాలు..!

సంక్రాంతి స్పెషల్

సంక్రాంతి స్పెషల్

Khammam : ఖమ్మంలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు రైతు బంధు సంబురాలను వెరైటీగా సెలబ్రేట్ చేస్తున్నారు.. తమ అభిమాన నాయకుడి ఫోటలతో కూడిన ఫ్లేక్సీలను గంగిరెద్దులకు కట్టి ప్రచారం నిర్వహించారు..

  సీఎం కేసీఆర్ చిత్ర పటాలు సంక్రాంతికి పండగకు హైలైట్ గా నిలిచాయి.. సంక్రాంతికి ఇంటిముందు వచ్చే గంగిరెద్దుల వాళ్లు రైతు బంధు పతకం ప్రచారంతో కూడా ఫ్లేక్సిలను తమ గంగిరెద్దులకు కట్టారు.. రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


  మరోవైపు ఇటివల రైతు బంధు సాయంలో భాగంగా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు 50 వేల కోట్లు చేరిన అంశాన్ని కూడా ఫ్లేక్సీల్లో పొందుపర్చారు.


  కాగా ఈ ప్లేక్సిల్లో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ ఫోటలతో హైలెట్ గా నిలిచాయి.. ఈ చిత్రపటాలు ఉన్న గంగిరెద్దులు ప్రతి ఇళ్లు తిరుగుతూ డూడూ బసవన్నల వాయిద్యాలు వినిపిస్తున్నారు.


  సంక్రాంతి పండగకు గంగిరెద్దుల సందడి.. డూడూ బసవన్నల విన్యాసాలతో సందడిగా మారుతుంది. గంగిరెద్దుల ఆటలు లేనిదే సంక్రాంతి పరిపూర్ణం కాదు. ఇంటింటికీ వచ్చి బసవన్నలు చేసే విన్యాసాలను పెద్దలు, పిల్లలను ఎంతగానో అలరిస్తాయి.ఇలాంటీ తరుణంలో వాటికి ఫ్లెక్సీలు కట్టడడంతో అవి మరింత ఆకర్షణగా నిలిచాయి.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam, Sankranti

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు