తెలంగాణ సర్కార్‌పై భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని, నిరసన తెలిపే ప్రజా హక్కును కాలరాస్తున్నారంటూ కేసీఆర్ సర్కార్‌పై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: January 27, 2020, 10:01 AM IST
తెలంగాణ సర్కార్‌పై భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(File Photo: PTI)
  • Share this:
తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందంటూ కేసీఆర్ సర్కార్‌పై బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం తలపెట్టిన సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...సోమవారం ఉదయం విమానంలో ఢిల్లీకి వెనక్కిపంపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చంద్రశేఖర్ ఆజాద్..తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ హిందీలో ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్యాగ్ చేశారు.

హైదరాబాద్ నుంచి తనను వెనక్కి పంపడమే కాకుండా...తనను అదుపులోకి తీసుకోవడానికి ముందు తన మద్దతుదారులపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని, నిరసన తెలిపే ప్రజల హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ముందుగా తమను కర్రలతో కొట్టారని, ఆ తర్వాత తనను అరెస్టు చేసి ఢిల్లీకి వెనక్కి పంపారని తెలిపారు. హైదరాబాద్‌‌లో తనకు జరిగిన అవమానాన్ని బహుజన సమాజం ఎప్పటికీ మరవబోదన్నారు చంద్రశేఖర్ ఆజాద్. హైదరాబాద్‌కు త్వరలోనే మళ్లీ వస్తానంటూ ట్వీట్ చేశారు.First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు