news18
Updated: January 6, 2021, 5:40 PM IST
డర్టీ హరి సినిమా పోస్టర్ (ఫైల్)
- News18
- Last Updated:
January 6, 2021, 5:40 PM IST
హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న డర్టీ హరి (Dirty Hari) సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ... డర్టీ హరి సినిమాను ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులపై మైహోం రామేశ్వర్ అనుచరులు దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అశ్లీలతను చూపిస్తూ చిత్రాన్ని నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇటువంటి సినిమాల వల్ల హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కించపరుస్తున్నారని.. ఈ చర్యలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు.
కాగా, డర్టీ హరి సినిమాను ఫ్రైడే మూవీస్ బ్యానర్ పై గుదురు సతీష్ బాబు, గుదురు సాయి పునీత్ లు నిర్మించారు. సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో... శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బోల్డ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫాంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం నాయకులు సినిమాను ఓటీటీ నుంచి తీసేయాలని ఆందోళనలు చేయడం గమనార్హం.
Published by:
Srinivas Munigala
First published:
January 6, 2021, 5:28 PM IST