Home /News /telangana /

BHARAT RASHTRIYA SAMITHI CM KCR IS PLANNING TO FORM NEW NATIONAL PARTY IT WILL BE ANNOUNCED THIS MONTH END SK

CM KCR: కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. ఈ నెలలోనే ప్రకటన..! పార్టీ పేరు ఇదే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR New National Party: సీఎం కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే నెలలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మరో సంచలనానికి తెరదీశారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోనే ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని (CM KCR New National Party) ప్రకటిస్తారని సమాచారం. కొత్త జాతీయ పార్టీపై మంత్రులు, ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్న ఆయన.. ముఖ్యమంత్రిగా ఉంటూనే..జాతీయ పార్టీకి పనిచేస్తానని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజా రాజకీయాలు, కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలపై మంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించారు. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ గురించి ప్రస్తావించినట్లు సమాచారం. భారత రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేద్దామని.. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి.. నిర్ణయం తీసుకుందామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. రూ.100కే సర్కారు వారి ప్రిపరేషన్ బుక్.. వివరాలివే

    దేశంలో బీజేపీ ఆగడాలు పెరిగాయని.. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉందని.. దేశ ప్రజలంతా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని సీఎం కేసీఆర్ నేతలతో అన్నారు. ఆ పాత్రను కొత్త జాతీయ పార్టీ పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలని అన్నారు. పలు పార్టీలను ఏకంగచేసి.. ఎన్డీయే అభ్యర్థిని ఓడించాలని.. తద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకే రుణాలపై కేంద్రం ఆంక్షలు విధిస్తోందని.. కేంద్రం తీరుపై న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని.. ఈ తరుణంలో వ్యవస్థను చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఉందని నేతలతో సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది.



    ఢిల్లీ మాదిరే.. హైదరాబాద్ కూడా జాతీయ రాజకీయాలకు అడ్డాగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నట్లు విశ్వసనీయ వర్గాల తెలిసింది. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ ప్రకటించాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ.. కొత్త పార్టీ ఏర్పాటుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీకి .. జైభారత్ (Jai Bharat), నయాభారత్ (Naya Bharat), భారత్ రాష్ట్రీయ సమితి (Bharat Rashtriya Samithi) వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో భారత్ రాష్ట్రీయ సమితి (BRS) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించనున్నట్లు సమాచారం. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పార్టీని ఈ నెలాఖరులో ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యకర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఐతే ఆ సమావేశానికంటే ముందే..జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.
    Published by:Shiva Kumar Addula
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు