హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rakesh tikait : టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టికాయత్.

Rakesh tikait : టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టికాయత్.

Rakesh tikait on cm kcr

Rakesh tikait on cm kcr

Rakesh tikait : టీఆర్ఎస్ పార్టీపై భారత కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అని అన్నారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్‌ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారత కిసాన్ యూనియన్ సీఎం కేసిఆర్‌కు షాక్ ఇచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యాలు చేశారు. కనీస మద్దతు ధరల కనీస చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లతో రైతు ఉద్యమం ప్రారంభమై నవంబర్ 26 నాటికి ఏడాది పుర్తిచేసుకుంటున్న సంధర్భంలో వారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. .( Bharat kisan union leader Rakesh tikait ) ఈ సంధర్భంగా యూనియన్ నేత రాకేశ్ టికాయత్ రాష్ట్ర ప్రభుత్వం రైతు విధానాలపై ఫైర్ అయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఉద్యమంపై టీఆర్​ఎస్ వైఖరి స్పష్టంగా లేదని ఆరోపించారు టికాయిత్​ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకేనని (Rakesh Tikait fire on KCR) అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల.. రైతులు ఆందోళన చెందుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకు అండగా ఉంటానని చెప్పారు. ధర్నా చౌక్​ వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రాకేశ్ టికాయిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు వివిధ రైతు సంఘాల నేతలు సహా పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.

మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు మూడు లక్షల పరిహారం ఇచ్చినట్టే రాష్ట్రంలో ఆత్మహత్యలు ( farmers suicide ) చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ( Telangana government ) ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని పేర్కొన్నారు .భాషలు వేరైనా.. భావన ఒకటెనని స్పష్టం చేశారు.

ఇది చదవండి  : సింగరేణిలో సమ్మె నోటిస్.. ప్రైవేటికరణకు వ్యతిరేకంగా సమ్మె


దీంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం ( delhi ) సాగు చట్టాల రద్దును పార్లమెంట్‌లో ( parlament )  ఆమోదించాలని టికాయత్ డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని.. కనీస మద్దతు ధరల గ్యారెంటీ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


ఇది  చదవండి : కరీంనగర్‌లో రెబల్స్ బెడద.. క్రాస్‌ ఓటింగ్‌పై టెన్షన్.


కాగా సీఎం కేసిఆర్ ( cm kcr ) రైతు ధాన్యం కొనుగోలుపై గత రెండు రోజులుగా ఢిల్లీలో మాకం వేసి బుధవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా ఢిల్లీకి వెళ్లే ముందే రైతు ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటించడతో పాటు ప్రాణాలు కోల్పోయిన రైతులకు మూడు లక్షల రూపాయాల పరిహారన్ని స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో తామే వెళ్లి నేరుగా రైతు మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని ఇస్తామని చెప్పారు.

First published:

Tags: CM KCR, Indira Park, Trs

ఉత్తమ కథలు