Home /News /telangana /

BHAINSA CLASHES TENSION PREVAILS AFTER GROUP CLASHES AGAIN SEVERAL INJURED SU ADB

Bhainsa Clashes: భైంసాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. వాహనాలు, దుకాణాలకు నిప్పు.. తలలు పగిలేలా రాళ్ల దాడులు..

భైంసా అల్లర్లు

భైంసా అల్లర్లు

నిర్మల్ జిల్లాలోని భైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    నిర్మల్ జిల్లాలోని భైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ.. అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. దీంతో జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే.. కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు. వారిలో కొందరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు

    పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో బైంసాలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అయితే అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక, భైంసాలో డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇక, గతేడాది కూడా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.



    భైంసా అల్లర్లను తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
    ఇక, భైంసాలో జరిగిన అల్లర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. అల్లర్లలో ఇద్దరు రిపోర్టర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయద్దని విమర్శించారు. భైంసాలో జరిగిన అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Clashes, Nirmal, Telangana

    తదుపరి వార్తలు