• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • BHADRADRI SITA RAMA KALYANAM TALAMBRALU BURIED IN 20 FEET PIT IN ANDHRAPRADESH VILLAGE FULL DETAILS HERE HSN KMM

భద్రాద్రిలో అపచారం.. 15 క్వింటాళ్ల సీతారాముల తలంబ్రాలను ఏపీకి తీసుకెళ్లి 20 అడుగుల గొయ్యి తవ్వి మరీ పూడ్చేశారు..!

భద్రాద్రిలో అపచారం.. 15 క్వింటాళ్ల సీతారాముల తలంబ్రాలను ఏపీకి తీసుకెళ్లి 20 అడుగుల గొయ్యి తవ్వి మరీ పూడ్చేశారు..!

సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలను పూడ్చుతున్న దృశ్యం

భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన ఈ ఆలయం. అంతటి పరమ పవిత్రమైన దేవాలయంలో నిత్యం ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి శ్రీరామచంద్రుణ్ని రామనారాయణుడని ఉచ్ఛరిస్తున్నారని..

 • Share this:
  సీతారామచంద్రులు.. ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలు. కష్టనష్టాలలో భార్యభర్తలు ఎలా మసలు కోవాలన్న దానిపై ఇప్పటికీ ఎప్పటికీ సీతారాముల దాంపత్యమే భారతావనికి ఆదర్శం. ప్రతి పురుషుడు శ్రీరామునిలా.. ప్రతి స్త్రీ సీతమ్మవారిలా మసలు కుంటే ప్రతి కుటుంబం.. ప్రతి సమాజం.. రాజ్యం శుభకాంతులతో.. సుఖశాంతులతో విరాజిల్లుతుందన్న నమ్మకం.. విశ్వాసంతోనే ప్రతి ఏడాది ఆ ఆదర్శ దంపతులకు భక్తులు దేశ నలుమూలల్లో ఉన్న దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటారు. ఆరోజున వారి కళ్యాణంలో ఉపయోగించిన తలంబ్రాలను సేకరించి, దాచిపెట్టుకుని భక్తులు తమ తమ కుటుంబాలలోని వివాహాల్లో ఉపయోగించే తలంబ్రాలలో కలుపుకుంటారు. అంతటి వైశిష్ట్యం ఉన్న కళ్యాణ తలంబ్రాల పట్ల భద్రాద్రి దేవాలయ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం, అపచారానికి పాల్పడ్డారు. ఏడాదిగా గోదాములో ఉంచిన టన్నుల కొద్దీ తలంబ్రాల బియ్యాన్ని భూమిలో పాతిపెట్టి భక్తుల విశ్వాసాలను తీవ్రంగా గాయపర్చారు. దీనిపై భద్రాద్రిలో భక్తులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పలు స్థాయిల్లో దీనిపై అభ్యంతరాలు, ఆక్షేపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

  భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన ఈ ఆలయం. అంతటి పరమ పవిత్రమైన దేవాలయంలో నిత్యం ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి శ్రీరామచంద్రుణ్ని రామనారాయణుడని ఉచ్ఛరిస్తున్నారని.. సీతారాముల ప్రవరలను తప్పుగా పలుకుతున్నారన్న విమర్శలపై నిత్యం వాగ్యుద్దాలు, దూషణలు, కోర్టు కేసులు సాగుతున్న విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు దేవస్థాన అధికారులు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం మరింత వివాదాన్ని రాజేసింది. గతేడాది భక్తులకు పంచకుండా ఉంచిన పవిత్ర తలంబ్రాలను నేలపాల్జేశారు. ఏకంగా భూమిలో పాతిపెట్టారు. ఇది ఎవరిని అడిగి చేశారు.? ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు..? ఒకవేళ స్వామివారి కళ్యాణం కోసం తయారు చేసుకున్న తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేయలేని సందర్భాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై స్పష్టమైన విధి విధానాలు ఉన్నట్టు లేదు. అయినప్పటికీ కోట్లాది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎలాంటి సున్నితత్వం లేకుండా ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

  ప్రతి ఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి పవిత్ర తలంబ్రాలను కలుపుతారు. దీనికోసం గోదావరి జిల్లాల్లోని కొందరు భక్తులు గోటితో వలచిన బియ్యాన్ని సైతం అందిస్తుంటారు. దీంతోబాటు దేవస్థానం పరంగా టన్నుల కొద్దీ బియ్యాన్ని సేకరించి కళ్యాణం కోసం తలంబ్రాలను సిద్ధం చేస్తారు. సీతారాముల కళ్యాణం అనంతరం లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్యాక్‌ చేసిన ముత్యాల తలంబ్రాలను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. భక్తులు వీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా భద్రాచలం వెళ్లి వచ్చారంటే ప్రసాదం కన్నా ముందుగా తలంబ్రాలను అడుగుతారు. అంతటి విశిష్టత ఉన్న తలంబ్రాల విషయంలో దేవాస్థాన అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతేడాది సిద్ధం చేసిన తలంబ్రాలను కోవిడ్‌ వైరస్‌ మూలంగా పంపిణీ చేయలేకపోయారు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

  కేవలం అంతరాయలంలోనే అర్చకుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరిపించారు కనుక పంపిణీ చేయలేకపోయామని చెబుతున్న అధికారులు, వారికి సలహా ఇచ్చిన పండితులపైనా సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జులై నుంచే దర్శనాలకు అనుమతి ఇచ్చినప్పుడు వచ్చిన ప్రతి భక్తునికి తలంబ్రాల ప్యాకెట్‌ను అందిస్తే ఉద్దేశం నెరవేరేది కదా అన్న చిన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. ఇలా పది టన్నుల తలంబ్రాలని కొందరు.. కాదు కాదు పదిహేను క్వింటాళ్ల తలంబ్రాలని చెబుతున్నారు. పవిత్ర తలంబ్రాలను భక్తులకు పంచాల్సింది పోయి.. తీరిగ్గా ఏడాది తర్వాత తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తంపట్నంలోని దేవాస్థాన భూముల్లో కొత్తగా నిర్మిస్తున్న శ్రీగోకులరామమ్‌లో 20 అడుగుల మేర గొయ్యి తీసి పూడ్చి పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతోబాటుగా సాక్ష్యం లేకుండా చేయడానికి గానూ తలంబ్రాలను నిల్వ ఉంచిన సంచులను కాల్చేయడం పట్ల కూడా భక్తజనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ఊపందకుంటోంది.
  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు