హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri:యాదాద్రి ఓకే.. మరి భద్రాద్రి సంగతేంటి? సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకుంటారా?

Bhadradri:యాదాద్రి ఓకే.. మరి భద్రాద్రి సంగతేంటి? సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకుంటారా?

Bhadrachalam Temple: అప్పట్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాదాద్రికి పనిచేసిన స్తపతి ఆనందసాయి భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారు. ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశారు. అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ.. భద్రాద్రి అభివృద్ధి మాటను పూర్తిగా పక్కనపెట్టేశారు

Bhadrachalam Temple: అప్పట్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాదాద్రికి పనిచేసిన స్తపతి ఆనందసాయి భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారు. ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశారు. అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ.. భద్రాద్రి అభివృద్ధి మాటను పూర్తిగా పక్కనపెట్టేశారు

Bhadrachalam Temple: అప్పట్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాదాద్రికి పనిచేసిన స్తపతి ఆనందసాయి భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారు. ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశారు. అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ.. భద్రాద్రి అభివృద్ధి మాటను పూర్తిగా పక్కనపెట్టేశారు

ఇంకా చదవండి ...

  (జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  తెలంగాణ సీఎం  కేసీఆర్‌  (CM KCR) తన అభీష్టానికి అనుగుణంగా వందల కోట్ల వ్యయంతో యాదాద్రి (Yadadri Temple) ని పూర్తి స్థాయి టెంపుల్‌టౌన్‌గా రూపొందించారు. నిజానికి అది సాధారణ విషయం కాదు. ఎంతో భక్తిశ్రద్ధలు, ప్రజల విశ్వాసాలకు విలువ ఇవ్వడం, ప్రాచీన విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా వారసత్వ సంపదను భవిష్యత్‌ తరాలకు అందివ్వడం కూడా పాలకుల కర్తవ్యమే. అయితే ఒక దేవాలయం విషయంలో  ఒకలా.. మరో దేవాలయం విషయంలో మరోలా వ్యవహరించడం పట్ల మాత్రం సరికాదన్నది భక్తుల మాట. యాదగిరిగుట్టను తిరుపతికి ధీటుగా మార్చిన సీఎం కేసీఆర్‌ భద్రాద్రి (Bhadradri Temple) విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం భక్తులు జీర్ణించుకోవడం లేదు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన అనంతరం తొలి శ్రీరామ నవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో భద్రాద్రి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ 2015 తర్వాత ఇక తిరిగిచూడలేదు. పైగా రూ.100 కోట్లతో భద్రాద్రిని టెంపుల్‌టౌన్‌గా తీర్చిదిద్దుతానని హామీని సైతం ఇచ్చారు. కానీ ఆయన దానిపై ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. సరికదా ఆ విషయం పట్ల కనీసం శ్రద్ధ కూడా చూపలేదు. దీనిపై భక్తుల్లో ఆవేదన, ఆందోళన, ఆక్రోశం వ్యక్తమవుతోంది. యాదాద్రి పట్ల అంత భక్తి శ్రద్ధలు చూపి, అద్భుతంగా మలచిన సీఎం కేసీఆర్‌, భద్రాద్రి విషయంలో మాత్రం ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఏంటన్నది భక్తుల ప్రశ్న.

  అయ్యో రైతన్నకు ఎంత కష్టకాలం.. ఆ జిల్లాలో కిలో నాలుగు రూపాయలకు పడిపోయిన టమాట ధర.

  భద్రాద్రి.. కోట్లాది భక్తులు పారవశ్యంతో పిలుచుకునే పిలుపు. భద్రాద్రి సీతారాములు అన్నా.. వారి కళ్యాణం అన్నా.. ఆనక తెల్లవారే జరిగే శ్రీరామ పట్టాభిషేకం అయినా చూసి తీరాల్సిందే. ఎవరైనా భక్తి పారవశ్యానికి లోను కావాల్సిందే. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. జీవితంలో ఒక్కసారైనా సీతారాముల కళ్యాణం చూడాలని తపించడం.. చూసి తరించాలని ఆశపడుతుంటారు భక్తులు. ఈ ఏడాది ఏప్రిల్‌ పదో తేదీన ఆదివారం నాడు సీతారాముల కళ్యాణం జరగనుంది. అనంతరం 11న అంటే సోమవారం నాడు శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయి. భద్రాచలంలోని మిథిల స్టేడియం దీనికి వేదిక కానుంది. కోవిడ్‌-19 కరోనా వైరస్‌ మూలంగా 2020, 2021లలో సీతారాముల కళ్యాణాన్ని కేవలం అంతర మండపానికే పరిమితం చేశారు. ఆన్‌లైన్‌లో మాత్రమే వీక్షించే కల్పించారు. కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని ఆంక్షలను ఎత్తేసింది. దీంతో ఈసారి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

  No youngster in Village: ఆ ఊళ్లో సగం ఇళ్లకు తాళాలే.. మిగతా ఉరంతా వృద్దులే.. ఇంతకీ ఎక్కడా ఊరు..? ఏమిటా కథ..?

  రెండేళ్ల అనంతరం ప్రత్యక్షంగా సీతారాముల కళ్యాణం చూసే మహద్భాగ్యం కలగడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలోనే తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. కనీసం రెండు లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి ఏర్పాటు చేస్తోంది. ఇంకా భక్తులకు అవసరమైన తాగునీరు, మజ్జిగ, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పువ్వడ అజయ్‌కుమార్‌, భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టిలు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులు సంతృప్తికరమైన స్థాయిలో కళ్యాణాన్ని వీక్షించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ దగ్గరి నుంచి వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా వచ్చే వీఐపీలకు భద్రత కోసం వందల సంఖ్యలో బలగాలను ఉపయోగిస్తున్నారు.  ఎన్ని చేసినా ఆ రెండు రోజుల కోసం తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. వాస్తవానికి అప్పట్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాదాద్రికి పనిచేసిన స్తపతి ఆనందసాయి భద్రాద్రి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారు. ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశారు. అనంతరం ఏం జరిగిందో తెలీదు కానీ.. భద్రాద్రి అభివృద్ధి మాటను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇప్పటికైనా పూనుకుని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను భక్తులు కోరుతున్నారు.

  First published:

  Tags: Bhadrachalam, Bhadradri kothagudem, CM KCR, Telangana

  ఉత్తమ కథలు