Home /News /telangana /

BHADRADRI KOTTAGUDEM DISTRICT VILLAGERS COMPARE WATER FROM TREE ROOTS WITH AYURVEDIC WATER SNR BKU NJ

Bhadradri Kottagudem:ఆ నీళ్లు తాగితే ఆడ,మగ వాళ్లకు ఆ సమస్యలు ఉండవంట తెలుసా

(ఆ నీళ్లలో ఏముందో)

(ఆ నీళ్లలో ఏముందో)

Water Wonder:అక్కడి భూగర్భంలో నీళ్ల ఆనవాళ్లు దొరకవు. ఎక్కడ బావి తవ్వనా చుక్కనీరు రాదు. అంతర్భాగంలో బొగ్గు.. ఉపరితలంపై రాతిగుట్టలు మాత్రమే ఉండే ప్రాంతం. రెండువందలకు పైగా ఆదివాసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరి వారికి నీటి సౌకర్యాలు ఎలా? తాగు నీటి మాటేంటి..?

ఇంకా చదవండి ...
  (Uday kumar,News18,Bhadradri kothaguedem)
  ఎక్కడైనా మంచినీళ్లు దొరకని ఊరుంటుందా. ఉండనే ఉండవు. కాని భధ్రాధ్రికొత్తగూడెం (Bhadradri Kottagudem) జిల్లా మణుగూరు (Manuguru) మండలం పరిధిలోని తోగ్గూడెం(Toggoodem) అనే గిరిజన గ్రామం ఉంది. అక్కడ మాత్రం నీరు పుట్టదు. అంటే భూమిలో తొవ్వినా రాదు. సుమారు రెండు వందల ఆదివాసీ కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు నీటి వసతిని కల్పంచాలని యత్నించాయి. చుట్టు పక్కల అంతా బొగ్గుబావులు ఉండటం, భూగర్భంలో నీటిశాతం పూర్తిగా ఇంకిపోవడంతో బావులు తొవ్వినా, యంత్రాలతో బోర్లు(Bores) వేసినప్పటికి చుక్క నీరు దొరకని పరిస్థితి. తోగ్గూడెం నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ (Groundwater Department)ఇతర శాఖల సహకారంతో పలు చోట్ల పాయింట్ చేసి తాగునీటి కోసం తవ్వకాలు జరిపినా నిష్ప్రయోజనంగా మారింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ(Mission Bhagiratha)తో ఆ గూడెంకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాని ఊళ్లోకి వచ్చిన నీరు మాత్రం అక్కడి జనం తాగడం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి, గిరిజన బిడ్డలు తాతముత్తాతల కాలం నుంచి ఎండిపోయి ఉన్న ఓ ఊటనీటితోనే గొంతు తడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

  రాళ్లగుట్టల్లో ఆయుర్వేద నీరు…
  తోగ్గూడెం గ్రామానికి దగ్గరలో రథంగుట్టకు దిగువన ఉధ్భవించింది మద్ది. నేరేడు చెట్ల వేర్ల నుంచి ఉబికి వచ్చే జలధారతోనే దప్పిక తీర్చుకుంటున్నారు ఇక్కడి జనం. వందల ఏళ్లుగా ఈ నీటికుంటే తమ దాహార్తిని తీరుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఊళ్లోకి మంచినీళ్లు వస్తున్నా..ఇవే తాగడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. అవి అమృతజలమో..లేక ఆయుర్వేత తీర్ధమో తెలియకు కాని..ఆ నీటిని తాగితేనే తాము ఆరోగ్యంగా ఉంటున్నామని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతే కాదు ..ఎలాంటి కీళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే తగ్గిపోతాయనే కొత్త విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. మద్ది చెట్టు, జిన్న చెట్టు వేర్ల నుంచి వచ్చే ఆ కుంటలోని నీరు ఎండిపోవడం చూడలేదంటున్నారు గిరిజనులు.

   Bhadradri Kottagudem district Villagers compare water from tree roots with Ayurvedic water snr bku nj
  ( ఆ నీళ్లలో ఏముందో)


  అమృత జలమా..ఆయుర్వేద తీర్ధమా..
  నిత్యం ఆ వృక్షాలను పూజిస్తూ ఆ తోగుకు వనదేవత అయిన సమ్మక్క పేరు పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అడవి తల్లి మహాత్యంతోనే నీటి ఆనవాళ్లే లేని చోట జలధార పుట్టిందంటూ ఆదీవాసులు విశ్వసిస్తున్నారు. వారి భక్తి విశ్వాసాలను గౌరవించిన అటవీ శాఖ అధికారులు సైతం ఆ నీరు కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నారు.

  తమకు ప్రభుత్వం కల్పంచిన మిషన్ భగీరథ నీటి వసతికి కృతజ్ఙతలు చెబుతూనే తమకు ఆయుర్వేదంగా మారిన తోగునీటినే సేవిస్తామని అంటున్నారు. తోగు ఆధారంగానే తమ గ్రామం తోగ్గూడెంగా పురుడు పోసుకుందని తమ గ్రామం ఉనికి ఉన్నంత వరకు తోగునీరే తమకు ప్రధాన త్రాగునీరంటున్నారు గిరిజనులు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bhadradri kothagudem, Drinking water

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు