హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam: ప్రేమించి మోసం చేశాడు..పెళ్లి చేసుకోమంటే చంపుతానంటున్నాడట

Khammam: ప్రేమించి మోసం చేశాడు..పెళ్లి చేసుకోమంటే చంపుతానంటున్నాడట

(యువతి మౌనదీక్ష)

(యువతి మౌనదీక్ష)

Khammam:ఫ్రెండ్‌గా పరిచయమయ్యాడు, ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు.పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత పెళ్లి చేసుకోమంటే చంపేస్తానని బెదిరించాడు. ప్రియుడి ముసుగులో ఉన్న నయవంచకుడికి బుద్ధి చెప్పాలని..అతనితోనే పెళ్లి జరపించాలని యువతి అతని ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది.

ఇంకా చదవండి ...

  నమ్మే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు ఉంటారు. ఈ విషయాన్ని వయసులో అమ్మాయిలు తెలుసుకోకపోవడం వల్లే ప్రేమికుడి ముసుగులో ఉన్న మోసగాళ్లను నమ్మి నడిరోడ్డున పడుతున్నారు. ఖమ్మం(Khammam)లో ప్రియుడి పెళ్లి ఆపడానికి కల్యాణ మండపానికి వెళ్లి భంగపడ్డ యువతి ఘటన జరిగిన 24గంటల్లోనే మరో యువతి నచ్చిన వాడు శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ అతని ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. ఖమ్మంకు చెందిన దీప్తి(Deepthi) అనే యువతి పేరెంట్స్ 2009నుంచి ఆటోనగర్‌(Autonagar)లో హోటల్(Hotel), బాయ్స్‌ హాస్టల్ (Boys' Hostel), నడుపుతున్నారు. రీసెంట్‌గా దీప్తి ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న గుణగంటి పవన్‌కృష్ణ (Gunaganti Pawan Krishna)అనే యువకుడు పరిచయం అయ్యాడు. మంచి మాటలతో, దీప్తి కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. 2021లో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి తరచూ దీప్తీ ఇంటికి వెళ్లడం, వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడుతూ మంచివాడనే ముద్రవేయించుకున్నాడు. ఇదే సమయంలో అనగా 2021లో పవన్‌ తల్లిదండ్రులు శ్రీనివాసరావు(Srinivasa Rao) ,మమత(Mamata)హైదరాబాద్‌ (Hyderabad)వెళ్లిన సమయంలో దీప్తీని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు.

  యువతి మౌనదీక్ష..

  ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకొని కోరిక తీర్చుకున్న పవన్..ఆ తర్వాత దీప్తి ప్రెగ్నెంట్ అని తెలియగానే అబార్షన్ చేయించాడు. ఆతర్వాత బాధితురాలు పెళ్లి చేసుకోమని పదే పదే అడగటంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తాను బీసీ సామాజికవర్గానికి చెందిన వాడినని..దీప్తి ఎస్సీ సామాజికవర్గానికి చెందినది కావడంతో చిన్నచూపి దూరం పెట్టాడు. పెళ్లి విషయంలో ప్రియుడ్ని గట్టిగా నిలదీయడంతో పవన్ దీప్తిని చచ్చిపోమ్మని లేదంటే తానే చంపేస్తానంటూ బెదిరించడం, ఇంటి దగ్గరకు కిరాయి రౌడీలను పంపాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

  ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన| Young woman worried in front of boyfriend's house in Khammam
  (యువతి మౌనదీక్ష)

  ప్రియుడితోనే ప్రాణహాని..

  తనకు జరిగిన అన్యాయాన్ని పవన్ తల్లిదండ్రులకు చెప్పుకుందామని వెళ్తే వాళ్లు కూడా ఈవిషయంలో కొడుకుని వెనకేసుకొస్తూ పెళ్లి జరిపించమని..ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమని బెదిరించారంటోంది బాధితురాలు. ప్రేమ పేరుతో యువకుడి చేతిలో మోసపోవడమే కాకుండా..తన కుటుంబ సభ్యుల్ని కిరాయి రౌడీలతో బెదిరించడంతో తాను కూడా ప్రాణాలకు సైతం తెగించి పవన్‌తో పెళ్లి జరిపించాలని మౌనదీక్షకు దిగింది దీప్తి. ప్రియుడి ఇంటి ముందు భైటాయించింది.

  న్యాయం జరిగే వరకు..

  తనకు పవన్‌తో వెంటనే పెళ్లి జరిపించాలని దీప్తి కోరుతోంది. తనకు , తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నందు వలన రక్షణ కల్పించాలని బాధితురాలు కోరుతోంది. తనకు న్యాయం జరగకపోతే ప్రేమ పేరుతో లోబర్చుకొని..కులం పేరుతో దూరం పెడుతున్న పవన్ కుటుంబంతో ఎంత వరకైనా పోరాటం చేస్తానంది. దళితులను మాయమాటలతో శారీరకంగా వాడుకొని ఇలా రోడ్డున పడేసేవారికి తగిన బుద్ధి చెప్పడానికి మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు , ప్రజాస్వామ్యవాదులు తనలా మోసపోయిన బాధితురాలి పక్షాన నిలబడాలని కోరుతోంది బాధితురాలు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Love cheating

  ఉత్తమ కథలు