హోమ్ /వార్తలు /తెలంగాణ /

కలలోకి అమ్మవారు.. దేవుడమ్మగా మారిన సంతోష్.. అసలు చరిత్ర ఇదే..!

కలలోకి అమ్మవారు.. దేవుడమ్మగా మారిన సంతోష్.. అసలు చరిత్ర ఇదే..!

X
భద్రాద్రిలో

భద్రాద్రిలో దేవుడమ్మగా మారిన యువకుడు

Bhadradri: విభిన్న సంస్కృతికి సంప్రదాయాలకు నిలయమైన భారతా వనిలో నేటికీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.‌ ఎవరి నమ్మకం వారిది. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ పలువురు తమ జీవితాన్ని భగవత్కార్యానికి అంకితం చేస్తున్న సంఘటనలు తరచుగా చూస్తుంటాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Telangana

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

విభిన్న సంస్కృతికి సంప్రదాయాలకు నిలయమైన భారతా వనిలో నేటికీ ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.‌ ఎవరి నమ్మకం వారిది. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ పలువురు తమ జీవితాన్ని భగవత్కార్యానికి అంకితం చేస్తున్న సంఘటనలు తరచుగా చూస్తుంటాం. ఇటువంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలం కాటాయగూడెంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంత వాసులతో దేవుడమ్మగా పిలవబడుతున్న సంతోష్ 12 సంవత్సరాల క్రితం అందరిలానే సాధారణంగా తిరిగి ఓ పురుషుడు. అయితే 12 ఏళ్ల క్రితం అమ్మవారు కలలోకి వచ్చి తన జీవితాన్ని భగవత్ కార్యానికి ఉపయోగించమని ప్రేరేపించడంతో దేవుడమ్మగా మారిన సంతోష్ ఈ ప్రాంతంలో ఓ కోవెలను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం గిరిజనులచే దేవుడమ్మగా కీర్తించబడుతున్నారు.

సొంత ఖర్చులతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ, చుట్టుపక్కల వాళ్ళకి మంచి చెడులో సహాయం చేస్తున్నారు.‌ పగిడిద్దరాజును పెళ్లి చేసుకున్నానని చెబుతున్న సంతోష్ ఈ ప్రాంత వాసులకు గిరిజన పూజారిగా పేరు కీర్తీస్తున్నారు. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలం కాటాయిగూడెంలో అచ్చం మేడారంలో జరిగే జాతర మాదిరిగానే సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిస్తున్నారు. నిజానికి మేడారంలోజాతర రెండు ఏండ్లకు ఒకసారి జరుగుతుంది.

ఇది చదవండి: వంట చేయడంలో వినూత్న ఐడియా.. అందుకే సక్సెస్ అయ్యాడు..! లాభాలు సూపర్

సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ప్రతియేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతి రూపాలుగా ఉన్న కుంకుమ భారినలను తీసుకువస్తారు.

ఇది చదవండి: పులితో సెల్ఫీ కావాలా..? సఫారీతో లక్కీ ఛాన్స్.. ఖర్చు ఎంతంటే..!

పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర , ఒరిస్సా రాష్ట్రాలనుండి కూడా అధిక సంఖ్యలో భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతర మొదటిరోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవరోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) వైవేద్యంగా సమర్పించుకుంటారు. అచ్చం ఇదే రీతిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయిగుడెంలో నిర్వహిస్తుంటారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు