హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fake Jobs: ఈమె మామూలు మహిళ కాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటూ ఎంతకి తెగించింది..

Fake Jobs: ఈమె మామూలు మహిళ కాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటూ ఎంతకి తెగించింది..

ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

టైలరింగ్ చేసుకునే ఓ మహిళ కేంద్ర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేయడం సంచలన రేకెత్తించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (Kranthi Kumar, News18,  Bhadradri Kothagudem)


  కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల (Government) కోసం ఎదురు చూస్తున్న, చదువుకున్న అభ్యర్థులకు ప్రభుత్వం నోటిఫికేషన్స్ (Notifications) ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో జరిగే లోపాలను కొంతమంది కేటుగాళ్ళు ఆసరా గా చేసుకొని చదువుకున్నా యువత ఆశలను ఉద్యోగుల ఇప్పిస్తామంటూ క్యాష్ చేసుకుంటున్నారు. అలా మోసం చేసే వారి కేటుగాళ్లల్లో కొద్దోగొప్పో చదువుకున్నవాళ్ళు కొందరైతే.. అసలు చదువుకోవడం తెలియని, టైలరింగ్ చేసుకునే ఓ మహిళ కేంద్ర ప్రభుత్వశాఖల్లో (Central Government jobs) ఉద్యోగాలంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేయడం సంచలన రేకెత్తించింది.


  భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వారావుపేట పట్టణంలో టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంది వెంకటలక్ష్మీ (Venkata Lakshmi). టైలరింగ్ చేయడం వెంకటలక్ష్మి వృతైతే ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడం ప్రవృత్తి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతీయువకులను మాయమాటలతో నమ్మించి డబ్బులు వసూలు చేసింది వెంకటలక్ష్మి. పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా రామసింగారం గ్రామానికి చెందిన సత్య శ్రీ అనే డిగ్రీ విద్యార్థి, అదే జిల్లా దేవరపల్లికి చెందిన నరేష్ అనే యువకుడి వద్ద ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసింది టైలర్ వెంకటలక్ష్మి.  కేంద్ర ప్రభుత్వం (Central Government) నూతనంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసిందని అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపింది. ఇదే క్రమంలో రెండు సంవత్సరాల క్రితం నరేష్, సత్య శ్రీ అనే  ఇద్దరి నుంచి రూ. ఐదు లక్షలు వసూలు చేసి మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ 'స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ' పేరుతో గెజిటెడ్ సంతకం చేసి మరీ ఇద్దరికి ఇచ్చేసింది.


  Business Woman: ఆమెకు వచ్చిన ఈ చిన్న ఆలోచనే.. ఇపుడు వేలకు వేలు సంపాదించి పెడుతోంది..


  అలా నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాకుండా డ్యూటీ చేయాల్సిన ప్రదేశం అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో పాడుబడిన ప్రభుత్వ భవనాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖాళీగా వెయిట్ చేయడమే డ్యూటీ అంటూ చెప్పింది వెంకట లక్ష్మి. గత 7 నెలలు నుంచి అలా పాడుపడ్డ భవనాల వద్ద సత్య శ్రీ, నరష్‌లతో డ్యూటీ చేయించింది ఆ మాయ లేడి. ఇంత చేసినా తమకు జీతాలు రావడం లేదని వెంకటలక్ష్మీని  బాధితులు నిలదీశారు. దీంతో ఇద్దరికి రూ. 20 వేలు చొప్పున ఓ నెల జీతాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది వెంకటలక్ష్మి.


  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు:


  వెంకటలక్ష్మి తమను మోసం చేసిందని గ్రహించిన ఇద్దరు బాధితులు అశ్వారావుపేట చేరుకున్నారు. వెంకటలక్ష్మి గురించి ఆరా తీయగా స్థానికంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు భారీగా వసూలు చేసినట్లు తెలిసిందని నరేష్ పేర్కొన్నాడు. సత్య శ్రీ, నరేష్ వెంకటలక్ష్మిని కలిసి తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇవ్వలేనంటూ చేతులెత్తేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంకట లక్ష్మీ ఎంతమంది నిరుద్యోగులను మోసం చేసిందో పోలీసులు విచారణ చేపట్టాలని, తమతో పాటు మోసపోయిన వారికి న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Crime news, Fake jobs, Local News

  ఉత్తమ కథలు