Home /News /telangana /

BHADRADRI KOTHAGUDEM WITH MANY NURSERIES AND RESEARCH INDUSTRIES BHADRADRI KOTHAGUDEM DISTRICT IS THE HUB OF HORTICULTURE KKB BRV PRV

Bhadradri: హార్టికల్చర్ హబ్‌గా భద్రాద్రి కొత్తగూడెం.. వ్యవసాయ పరిశోధన, నర్సరీల అభివృద్ధి

భద్రాద్రి

భద్రాద్రి

ఈ మండలాల్లో విస్తరించిన నర్సరీలు, పరిశోధనా కేంద్రాలు పరిశ్రమలతో ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యాన నర్సరీల కారిడార్‌గా దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ప్రసిద్ధికెక్కాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India
    (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem) ఎటుచూసినా పచ్చని చెట్లతో (Tree) కిలోమీటర్ల మేర విస్తరించిన నర్సరీలతో పచ్చదనం పరుచుకుందా అన్నట్లుంటుంది అశ్వారావుపేట ప్రాంతం(Ashwaravpet area). రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉద్యాన పంటల పరిశోధనా కేంద్రాలు అశ్వారావుపేట నియోజకవర్గం సొంతం. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఖమ్మం , దేవరపల్లి రాష్ట్రీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ఉద్యానవనాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ మండలాల్లో విస్తరించిన నర్సరీలు (Nursery), పరిశోధనా కేంద్రాలు పరిశ్రమలతో ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ వేలాది మందికి ఉపాధి (Employment) దొరుకుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యాన నర్సరీల కారిడార్‌గా దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ప్రసిద్ధికెక్కాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యానవనంగా అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రంలోనే అశ్వారావుపేట కావడం గమనార్హం. వీటన్నింటికీ మూలం అచ్యుతాపురంలోని ఉద్యాన నర్సరీ మరియు నారవారిగూడెం పరిధిలోని కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రాలు అని చెప్పుకోవచ్చు. అటవీ పరిశోధనా కేంద్రం: అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం పరిధిలో ఈ అటవీ పరిశోధనా కేంద్రం (Forest Research Centre) నెలకొని ఉంది. రాష్ట్రంలోనే ఈ కేంద్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతరించిపోతున్న అటవీ జాతి మొక్కలను పెంచుతారు. అడవులను విస్తరింపజేయడానికి మొక్కలపై ప్రయోగాలు చేస్తుంటారు. పట్టు పురుగుల కేంద్రం: అచ్చుతాపురంలో ఉద్యాన నర్సరీకి ఆనుకుని ఉన్న పట్టు పురుగుల కేంద్రంలో పట్టు పురుగుల పెంపకం, గూళ్ళ తయారీలో శిక్షణ కల్పిస్తారు. ఈ పట్టు ఉత్పత్తి శిక్షణా కేంద్రాన్ని (Silk Production Training Centre) సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పాల్వంచ కేంద్రంగా చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమశాఖ, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో 1989 ఏప్రిల్‌ 11న ప్రారంభించారు. దమ్మపేట మండలం ఆకినేపల్లి గ్రామంలో సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో స్వదేశీ పట్టు విత్తనాన్ని ఉత్పత్తి చేస్తారు. అచ్యుతాపురం నర్సరీ: ఉద్యానశాఖ ఆధ్వర్యం లో 30 ఎకరాల వైశాల్యంలో 1985-86 సంవత్సరాల మధ్య కాలంలో డీఆర్‌డీఏ ప్రోత్సాహంతో ఏర్పాటైంది. ఈ నర్సరీల్లో గిరిజనులకు ఉపాధి కల్పించి ఉద్యాన పంటలను ప్రోత్సహిం చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వివిధ జాతుల మొక్కల అంటు కట్టడంలో ఈ ప్రాంత యువతీ, యువకులు మంచి నైపుణ్యం సాధించారు. దీని స్ఫూర్తితోనే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సుమారు 100కు పైగా నర్సరీలు ఏర్పడ్డయి. ఈ నర్సరీల్లో మామిడి, సపోట, జీడిమామిడి, కొబ్బరి అంట్లు తయారు చేస్తుంటారు. ఇలా తయారైన మొక్కలను ఖమ్మం, వరంగల్‌, కృష్ణా, గుంటూరు మరియు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాలకు రాయితీల ద్వారా రైతులకు అందజేస్తారు. Bhadradri: ఆ జిల్లాలో రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పామాయిల్: దేశానికే ఆదర్శంగా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం: పొట్టి, పొడవు సంకరంగా కొబ్బరి రకం కొత్త విత్తనాన్ని ఇక్కడ తయారు చేస్తారు. ఈ కేంద్రాన్ని 1990 సంవత్సరంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో కొబ్బరితో పాటు మామిడి మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తుంటారు. సీవోడీ, ఎంజీడీ, ఎంఓడీ అనే కొబ్బరి విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు. 1600 ఎకరాల జీడి తోట:నారవారిగూడెం, దమ్మపేట మండలం చీపురుగూడెం సమీపంలో రాష్ట్రీయ రహదారి పక్కనే అటవీశాఖ ఆధ్వర్యంలో 1600 ఎకరాల్లో జీడి తోటను పెంచుతున్నారు. వీటిని అటవీ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుస్తారు. కాగా ఎన్నో ఏండ్ల కిందట ఈ జీడి తోటను వేయడంతో ప్రస్తుతం చాలా వరకు సారం కోల్పోయింది. ఆయిల్‌ఫాం నర్సరీ: అశ్వారావుపేట మండలం, నారావారి గూడెం సమీపంలోని నర్సరీ...ఆయిల్‌ఫాం పంటల ప్రోత్సాహకానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఇది ఏకైక ఆయిల్ పామ్ నర్సరీ. ఇక్కడ ఆయిల్ పామ్ మొక్కల ఉత్పత్తి, పంపిణీ జరుగుతుంది. Rajanna Sircilla: బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం.., మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ అనువైన వాతావరణం: ఉద్యాన పంటలకు అనువైన వాతావరణం ఈ ప్రాంతం సొంతం. సారవంతమైన నేలలు, పుష్కలమైన భూగర్భ జలాలు ఉండటంతో ఉద్యాన పంటలను విస్తరింపజేశారు. ఉద్యాన పరిశోధనా కేంద్రం..అశ్వారావుపేటలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రం నెలకొల్పా రు. ఇందులో పలురకాలైన పండ్ల, కూరగాయల జాతులను నూతన ఉత్పత్తి చేస్తారు. వ్యవసాయ పరిశ్రమలు, ప్రైవేటు మూలికా పరిశ్రమలు: ఆయిల్‌ఫాం కర్మాగారం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్‌ఫెడ్‌ సంస్థకు చెందిన ఏకైక పామాయిల్‌ కర్మాగారం ఇది. రైతులు పండించిన పామాయిల్‌ గెలలతో ముడి పామాయిల్‌ను తయారు చేస్తారు. రాష్ట్రంలో ఆయిల్‌ఫాం విస్తీర్ణం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వ్యవసాయ నర్సరీ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పరిశోధనా నర్సరీ నియోజకవర్గానికే తలమానికం. వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వ్యవసాయ పంటలపై పరిశోధనలు చేస్తుంటారు. Injection Murder: తెలంగాణలో మరో సూది మందు హత్య.. భార్యపై ప్రయోగించిన భర్త.. ఎందుకంటే..? హెర్బెక్స్‌: వనమూలికల వేర్ల మందుల తయారీలో ఈ హెర్బెక్స్‌ అగ్రగామి. ఈ మందుల తయారీ కంపెనీలో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. కెమిలాయిడ్స్‌: ఇది కూడా వనమూలికల వేర్లతో మందులు తయారుచేసే మరో పరిశ్రమ. ఇవి రెండూ ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. శ్రీలక్ష్మీ తులసి ఆగ్రో పేపర్‌ బోర్డ్‌ లిమిటెడ్‌: అశ్వారావుపేటలోని పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో గత 25 సంవత్సరాల కిందట ఆదివాసీ గిరిజన పేపర్‌ బోర్డుగా ఏర్పాటై నేడు లక్ష్మీ తులసి ఆగ్రో పేపర్‌ బోర్డుగా అవతరించింది. ఇందులో అనేక మంది యువకులు ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా అశ్వారావుపేటలో అవేర్‌ సంస్థల ఆధ్వర్యంలో గ్రామీణ వృత్తి శిక్షణా కేంద్రం, సాంకేతిక వ్యవసాయ కళాశాల, అగ్రి క్లీనిక్‌, బీఈడీ కళాశాలలు నెలకొని ఉన్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bhadradri kothagudem, Forest, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు